డోనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ఏ ఫలితాలు సాధిస్తుందో? ఏ పర్యవసానాలకు నాంది పలుకుతుందో? ఇప్పుడైతే తెలియదు గానీ పెద్ద ఎత్తున మీడియా కేంద్రీకరణ మాత్రం జరిగింది. భిన్న కోణాల్లో విశ్లేషణలు వెలువడ్డాయి. చైనాకు ట్రంప్ ఎక్కడ లొంగిపోతాడో అన్న ఆందోళన, హెచ్చరికలు, కమ్యూనిస్టు దేశంతో సంబంధాలకు బాటవేసిన నాటి అధ్యక్షుడు నిక్సన్ తరువాత ఇతర నేతలు సాధించలేని దాన్ని ట్రంప్ సాధిస్తాడా? ఇలా పరిపరి ఆలోచనలు, ఆశలు వెల్లడయ్యాయి. ఎనభయ్యవ పడికి దగ్గరలో ఉన్న ట్రంప్ వ్యవహారశైలి ప్రకారం ఎందుకు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఇరుదేశాల నేతల మధ్య అనేక అంశాల మీద తీవ్ర విబేధాలు, అనుమానాలు ఉన్నప్పటికీ ఎవరూ తెగేదాకా లాగటం లేదు.అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా వ్యవహరించే ట్రంప్ చైనా అధినేత షీ జిన్‌పింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి.
“మీరు గొప్పనేత, నేను ఇలా చెప్పటాన్ని కొన్నిసార్లు జనాలకు నచ్చకపోవచ్చు, అయితే నేను ఎలా గైనా చెబుతాను. ఎందుకంటే ఇది నిజం, మీతో కలవటం ఒక గౌరవం, మీ స్నేహితుడిగా ఉండటం ఒక గౌరవం, గతం కంటే రెండు దేశాల సంబంధం భవిష్యత్‌లో ఎంతో మెరుగ్గా ఉండబోతున్నది ” అని ట్రంప్ ఉబ్బేశాడు. డోనాల్డ్ ట్రంప్-నరేంద్రమోడీ తమ మధ్య ఉన్న బంధం గురించి ఎలా మాట్లాడుకు న్నారో తెలిసిందే. ఇక్కడ గమనించా ల్సిందే మంటే ఇలాంటి బిస్కెట్లకు పడిపోయే రకం కాదు షీ జిన్‌పింగ్ అని చెప్పకతప్పదు. మెత్తమెత్తగానే తమ ధృడవైఖరిని వెల్లడించటం దౌత్యంలో తలపండిన చైనా నేతలు పొగడ్తలకు పొంగిపోరు, బెదిరింపులకు లొంగిపోరు అన్నది ఇరు దేశాల సంబంధాలు ప్రారంభమైన 1972 నుంచీ చరిత్ర చెప్పిన సత్యం. తైవాన్ సమస్యలో అమెరికా వ్యవహరించే తీరు తెన్నులు సంఘర్షణలకు దారితీయ గలవని, అది రెండు దేశాల మధ్య ఉన్న మొత్తం సంబంధాన్ని పెను ప్రమాదంలో పడవేయగలదని గురువారం నాడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశాడు.రెండు గంటల పాటు బీజింగ్ గ్రేట్ హాల్లో భేటీ తరువాత చైనా విదేశాంగశాఖ ప్రతినిధి అధికారికంగా వెల్లడించిన సమాచారమిది.
మొహమాటానికి పోతే ఏదో అయిందన్న సామెత తెలిసిందే. అంత్య నిష్టూరం కన్నా ఆదిలోనే చెప్పటం మేలన్నట్లుగా తైవాన్ విషయంలో చైనా నేతలు ఎప్పుడు మాట్లాడినా ఇదే స్పష్టతతో ఉన్నారు. స్థిరపడిన ఒక అధికార శక్తి, ఎదుగు తున్న మరొక శక్తిని తొలగిస్తా మని బెదిరిస్తే ఫలితం తరచుగా యుద్ధాలకు దారితీస్తుం దని పురాతన గ్రీకు చరిత్ర కారుడు చెప్పిన అంశాన్ని జిన్‌పింగ్ దౌత్య పరిభాషలో చెప్పారు. ఇది చైనా ‘అమెరికా’ ఇరాన్ పరిణామాలకే కాదు, ఎవరికైనా వర్తించేదే. మరోసారి అమెరికాను గొప్పగా చేస్తానని గతంలో ట్రంప్ ఇచ్చిన నినాదం మరొక దేశాన్ని ఎదగనిచ్చేది లేదని చెప్పటం తప్ప మరొకటి కాదు. డ్రాగన్ దేశంలో స్థిరత్వాన్ని సాధించేందుకు మరీ ఎక్కువ రాయితీలు ఇవ్వొద్దంటూ అమెరికా మేధావులు ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికాకు చైనా ఎంతదూరమో, చైనాకూ అమెరికా అంతే. ఇచ్చిపుచ్చుకోవటం తప్ప ఏదో ఒకవైపే అంతా ఉండాలంటే కుదరదు. అందుకే ఎవరికి వీలున్న రంగాలను వారు ప్రత్యర్ధులతో బేరసారాలకు వినియోగించుకుం టున్నారు. తాజాగా ట్రంప్ అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజాలను వెంటేసుకొని వెళ్లారు తప్ప చైనా నేతలు గతంలో అలాంటి పర్యటనలు జరపలేదు. దీని అర్ధం ఏమిటంటే పెద్ద మొత్తంలో వాణిజ్య మిగులుతో బీజింగ్ అనుకూల స్థితిలో ఉంది.అమెరికా అడుక్కొనేదిగా ఉండాలి తప్ప బెదిరిస్తే కుదరదు.
1970 దశకంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికలు సోవియట్-చైనా దేశాల మధ్య విబేధాలకు దారితీశాయి.ఈ పూర్వరంగంలో చైనాను దగ్గరకు తీసి ముందుగా సోవియట్‌ను, తరువాత చైనానూ దెబ్బకొట్టాలన్నది అమెరికా దుష్టాలోచన. ఇదే సమయంలో సోవియట్ తో తలెత్తిన విబేధాలతో నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవసరం కూడా చైనాకు ఏర్పడింది.అందుకే డెంగ్ సియావో పింగ్ నాయకత్వంలోని పార్టీ సంస్కరణలకు తెరతీసింది. అరబ్బు వ్యాపారి, ఒంటె కథలో ముందు గుడారంలో దూరి వ్యాపారిని బయటకు నెట్టేసిన ఒంటె మాదిరి చైనా కమ్యూనిస్టు వ్యవస్థను కూల్చివేయాలని అమెరికా దురాలోచన చేసింది. అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా అమెరికా ఒకందుకు ముందుకు వస్తే చైనా మరొకందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించు కొని ఇప్పుడు అమెరికానే అనేక రంగాల్లో సవాలు చేసే స్థితికి ఎదిగింది.
సోషలిస్టు వ్యవస్థను కూల్చివేయాలన్న నిక్సన్ ఆలోచనలను తరువాత వచ్చిన వారెవరూ నెరవేర్చ లేకపోయారని ఇప్పుడు ట్రంప్ అయినా ఆ పని పూర్తి చేస్తాడా? అంటూ కొందరు దింపుడు కల్లం ఆశతో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తియన్మెన్ స్క్వేర్ ఉదంతం ఆ కుట్రలో భాగమే, దాన్ని తిప్పికొట్టిన చైనా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది గనుక ఇప్పటికైతే అది పగటి కలే అని చెప్పక తప్పదు. ఇద్దరు నేతల మధ్య బీజింగ్‌లో చర్చకు వచ్చిన అంశాలు, వాటి తీరుతెన్నులు ఇంకా పూర్తిగా వెలువడలేదు. చైనా వెళ్లి ఏదో ఒకటి సాధించుకురావాలన్నది ట్రంప్ యంత్రాంగ గట్టి వాంచ. అందుకే చైనాలో పెట్టుబడులకే మొగ్గు చూపుతున్న తమ కార్పొరేట్లను సంతుష్టీకరించేం దుకు ట్రంప్ పాట్లు పడుతున్నాడు, అది జరుగుతుందా!
ట్రంప్ బీజింగ్ పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


