ఇక్కడున్న వారికి దమ్ములేక ఢిల్లీ నుండి పిలిపించుకుంటున్నారు

– మన తెలంగాణలో మన జెండానే ఎగరాలి
– వేరే జెండాలతో మనకు పని లేదు
– ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల ప్రజానికి జరిగే పోరాటం
– సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుంది
– ఎవరి మద్దతూ మాకొద్దు ఐటీ, శాఖ మంత్రి కె.తారక రామారావు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
తెలంగాణలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ వారికి బీఆర్‌ఎస్‌తో పోటీపడే దమ్ములేక ఢిల్లీ నుంచి పిలిపించుకుంటున్నారని, ఢిల్లీ ఉండే వారికి మనతో ఏమి పని అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయా దవ్‌తో షాద్‌నగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. షాద్‌నగ ర్‌ నెల రోజుల క్రితమే వచ్చానని, అంజన్న పిల వడం ద్వారానే మరొక్కసారి వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ కోసం 2001 నుంచి 2014 వరకు పోరాటం చేస్తే కాంగ్రెస్‌కి భవి ష్యత్తు ఉండదని తెలంగాణ ఇచ్చారే తప్ప తెలంగాణ మీద ప్రేమతో కాదని అన్నారు. మన తెలంగాణలో మన జెండానే ఎగరాలని, మన జెండా ఉండగా వేరే జెండాలతో మనకు పనిలేదని తెలిపారు. మన పరిపాలన మనమే కోసాగిద్దామని, ప్రతి చిన్నపనికి ఢిల్లీ వెళ్లాల్సిన పని మనకు లేదని అన్నారు. తెలంగాణ రావడం కోసం కాంగ్రెస్‌ తో కొట్లాడమని, తెలంగాణ వచ్చాక 2014 నుండి 2023 వరకు బీజేపీతో కొట్లాడుతున్నామని అన్నారు. ఢిల్లీ దొరలు ఏమి చేస్తారో చూద్దామని, మన ఇంట్లో ఏమైనా గొడ వలు ఉంటే మనం సక్కబెట్టుకుందామని అన్నారు. 2001 సంవత్సరం నుంచి పార్టీలో అంజన్న ఉన్నాడని, అందరితో కలుపుకుని వెళ్లే అంజన్న కు అందరి మద్దతు ఉండాలని అన్నారు. సాగునీరు, తాగునీరు అందిందని, రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. కేసీఆర్‌ మూడవ సారి అధికారంలోకి వస్తే అ మలు చేసే విషయాలు వివరించారు. షాద్‌నగర్‌కు సాగునీరు అందజేస్తామని వివరించారు. మోడీ పదిహే ను లక్షలు ఇస్తామని చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకుని వేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. అద్భుతమైన నాయకుడు కేసీఆర్‌ మన వెనక ఉండగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో మహబూబ్‌ నగర్‌ ఒక్క మెడికల్‌ కాలేజి లేదని కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఐదు మెడికల్‌ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. సింహం సింగిల్‌ గానే పోటీ చేస్తుందని ఎవరి మద్దతు మాకొద్దని అన్నారు. చిన్న చితక పనులు చేయనంత మాత్రాన అలగనవసరం లేదని, మూడవసారి గెలిచిన తరువాత పెండింగ్‌లోఉన్నా ప్రతీ పనిని చేయించు కుందామని తెలిపారు.
అంతకు ముందు జడ్పీ వైస్‌ చైర్మన్‌ నవీన్‌ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్‌లు వారి అనుచరులతో కలిసి భారీ ఎత్తున పార్టీలో చేరారు. వారికి కేటీఆర్‌ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం చైర్మన్‌ వల్యా నాయక్‌,సహకార పరపతి సంఘం చైర్మన్‌ రాజవర ప్రసాద్‌ రావు,జడ్పి వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, కేశంపేట ఎంపీపీ రవిందర్‌ యాదవ్‌, ఫరూఖ్‌నగర్‌ ఎంపీపీ ఖాజా ఇంద్రిస్‌, కొత్తూర్‌ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్య నారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ కొందుటి నరేందర్‌, కొత్తూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బాతుక లావణ్య దేవేందర్‌, సయ్యద్‌ ఇబ్రహీం, యువ నేత మురళి యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నటరాజన్‌ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌ నాయక్‌, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love