మొదటి రోజు మూడు నామినేషన్లు

– ఈ నెల 25వ తేది వరకు ఉన్న గడువు
నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.  మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బేతి నరేందర్‌ ఒక సెట్, మర్రి స్వామి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌  కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌  హనుమంతు కే. జెండగేకు అందజేశారు.  మొదటి రోజు మూడు నామినేషన్‌ రాగా ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది.  శుక్రవారం రోజు జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్‌ అధికారి,  జిల్లా కలెక్టర్‌ హనుమంత్‌ కె.జండగే తెలిపారు.
ఇబ్బందిపడ్డ జర్నలీస్టులు:
నామినేషన్‌ ప్రక్రియాలో బాగంగా కవరేజ్‌ కోసం వచ్చని జర్నలిస్టులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో రోడ్లుపైనే నిరిక్షిచాల్సి వచ్చింది. వంద మీటర్లు దూరంలో టెంటు వేయాలని అధికారులను కోరినప్పటికి వారు స్పందించకపోవడంతో కనీసం త్రాగూ నీరు లేకపోవడంతో కొనుగోలు చేసి మంచి నీరు తాగాల్సిన పరిస్ధితి వచ్చింది. వెంటనే వంద మీటర్ల దూరంలో టెంటు, మంచినీటీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Spread the love