బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..

– తుర్కయంజాల్‌ చౌరస్తాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
– డీసీఎంను ఢ కొన్న సిమెంట్‌ లారీ
– నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
– లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉన్న ఊరిలో ఉపాధి లేక నగరానికి వలసొచ్చి జీవనం సాగిస్తున్న నలుగురు కూలీలు.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అర్థరాత్రి మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్‌.. డీసీఎంను ఢకొీనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో.. ఇద్దరు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సోమవారం రాత్రి జరిగిన హిందూవాహిని జగరణకు వచ్చిన కూలీలున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్థరాత్రి జరిగింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన ఐనాల మహేష్‌ అలియాస్‌ బల్లు(21), పంపనోల్ల మహేష్‌ (55)తో పాటు మరి కొంతమంది డీజే సౌండ్స్‌లో పని చేసేవారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం రాత్రి జరిగిన హిందూ వాహిని వేడుకకు వీరు వెళ్లారు. రాత్రి పనులు ముగించుకొని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. తుర్కయంజాల్‌ సమీపంలో తులిప్స్‌ గ్రాండ్‌ హౌటల్‌ వద్దకు రాగానే ఎల్బీనగర్‌ వెళ్లాలని డీజే బాక్స్‌లతో వెళ్తున్న డీసీఎంను నిలిపారు. హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన యువకులు నాగ సాయిరెడ్డి, శివారెడ్డి లింగారెడ్డి డీసీఎం ఎక్కుతుండగా మాచర్ల నుంచి ఇంజాపూర్‌ గోదాంకు సిమెంట్‌ లోడ్‌తో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి డీసీఎంను ఢకొీట్టింది. డీసీఎంలో ఉన్న జియాగూడకు చెందిన డీజే ఆపరేటర్‌ ఐనాల మహేష్‌ (21), వంపలోల్లు మహేష్‌(55), గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాత మల్ల య్యపాలెంకు చెందిన నాగ సాయిరెడ్డి(22) అక్కడి క్కడే మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తుమ్మోజా లక్ష్యయ్య (52) మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణిం చాడు. డీసీఎం పక్కనే నిల్చున్న గుంటూరు జిల్లాకు చెందిన శిఖరెడ్డి, లింగారెడ్డి ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. వీరిద్దరూ హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. జియాగూడకు చెందిన అబిలాష్‌ చెవి తెగిపోయింది. సురేష్‌ కాలు విరిగింది. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్‌ మద్యం తాగి నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. పోలీసులు లారీ డ్రైవర్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా 181 ఎంజ్‌ వచ్చినట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ రవీందర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్టు సీఐ రవికుమార్‌ తెలిపారు. ఉస్మానియా అస్పత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టుమార్థం నిర్వహించి, నాలుగు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love