ఇండ్లస్థలాల కోసం నేడే మహాధర్నా

– మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలి :
టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు సమస్యను పరిష్కరించా లని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా జరగనుంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్ర మానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్న లిస్టులు హాజరవుతున్నారు. ఇందిరా పార్క్‌ దగ్గర ఉదయం 10 గంటలకు ప్రారం భమై సాయంత్రం నాలుగు గంటలవరకు ధర్నా నిర్వహించనున్నారు. దాదాపు 35 ఏండ్లుగా ఈ సమ స్య పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జర్నలిస్టులు భారీ సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బవవపున్నయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నిర్వహించే రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ తోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలి స్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని వివరించారు. ఇండ్లస్థలం జర్నలిస్టుల తీరని కోరిక కాకూడదని అభిప్రాయ పడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరించాని విజ్ఞప్తి చేశారు.

Spread the love