వియత్నాంలో పడవ బోల్తా 15 మంది భారతీయులు మృతి
చనిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాల వాసులు
హనోయ్ : వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది పర్యాటకులు మృతి చెందారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వాసులున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం ట్రిప్‌నకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. వీరిలో తెలంగాణ నుంచి 40 మంది ,ఏపీ నుంచి 35 మంది ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా వీరు మూడు పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హాన్ మే రుట్ నుంచి అన్‌థోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయల్దేరింది. అందులో 32 మంది భారతీయు లు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా.. సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో టీఎం థామస్ ఐజాక్ సంఘీభావం తెలిపారు. సీజేపీ(కాక్రోచ్ జనతా పార్టీ) కొనసాగిస్తున్న ఆందోళన శనివారం నాటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా త్రిపుర ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు జితేంద్ర చౌదరి, కేరళం ఆర్థిక మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అటు అలల ఉద్ధృతి కూడా తీవ్రంగా ఉండటంతో టూరిస్టులను కాపాడటం కష్టంగా మారింది. వీరిలో కొందరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. మరికొందరు గల్లంతవ్వగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. బోల్తా పడిన బోటులో ప్రయాణించిన 32 మంది ప్రయాణికుల జాబితాను భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది. మృతి చెందిన వారిలో ఏపీలోని కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ ఉన్నారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
విహారయాత్రలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


