కుంచెతో మహాదశ్యకావ్యాలను రచించేహొహొచిత్రకవి అతను. మనోహరమైన ఊహలతో, సౌందర్య శోభితమైన రేఖలతోహొఎన్నో కళాఖండాలను దిద్దితీర్చే ‘గీతాకారుడు’ అతను.హొబొమ్మలతో మాట్లాడించే విచిత్ర మాంత్రికుడు అతను. అంతేవాసులకు భాషాజ్ఞాన సంపదలను పంచిపెట్టే దేశికోత్తముడు అతను. అన్నింటికీ మించి నీలగిరి గీసిన మట్టి చిత్తరువు అతను. ఆహొమట్టిహొచిత్తరువు పేరు కూరెళ్ల శ్రీనివాస్. జగమెరిగిన ప్రజాచిత్ర కారుడు.
వచనకవితా సంపుటుల ముఖచిత్రాల్లో తొలిసారిగాహొకూరెళ్ల శ్రీనివాస్‌హొసంతకం చూసి నేను ముగ్ధుడనయ్యాను.హొఎప్పుడైనా ఈ చిత్రకారుడిని కలుసుకోవాలని ముచ్చటపడ్డాను. ఆత్మీయ మిత్రుడు యస్.రఘు ఆ ముచ్చట తీర్చాడు. ఒక సభలో శ్రీనివాస్‌ని పరిచయంచేసి, ఆ చెలిమి కలిమినిహొమనసుకందించాడు.హొరఘుని కలిసినా, కార్టూనిస్టు శంకరన్నతో మాట్లాడినా,హొకంబాలపల్లి శేఖర్‌ని పలకరించినాహొకూరెళ్ల శ్రీనివాస్‌ని కలిసినట్లే ఉంటుంది. ఎందుకంటేహొ ఈ నలుగురూ కళా సాహిత్య రంగాల్లో లబ్ధప్రతిష్టులు. ఎందరికో ‘ఇష్ట చతుష్టయం’. ఈ మిత్ర బృందాన్ని చూస్తేహొ సృష్టిలోని తీయందనాన్నీహొమనసారా ఆస్వాదించినట్లుహొ ఉంటుంది.
సమున్నత చిత్రకారుడిగా
వృత్తిరీత్యా శ్రీనివాస్‌హొప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రవృత్తి చిత్రకారుడు. వృత్తిని, ప్రవృత్తిని నైపుణ్యంతో,హొసూక్ష్మవివేకంతోహొసమన్వయంహొచేసుకొని సమున్నత చిత్రకారుడిగా రాణిస్తున్నాడు.హొనాలుగు దశాబ్దాలుగా విద్యా, కళా, సాహిత్య, సామాజికహొరంగాల్లోహొచిత్రకారుడిగాహొతనదైన స్వీయముద్రవేశాడు.హొ అవిశ్రాంతమైన కళా ప్రస్థానంలోహొఅందమైన, ఆలోచనాత్మకమైన తన బొమ్మల కొలువుతో తెలుగు సమాజాన్ని మురిపించి మరపించాడు. శ్రీనివాస్‌హొచిత్రాల్లోని జలవర్ణ సంగమం చూస్తే సీతాకొక చిలుక కూడా విస్తుపోతుంది. తెలంగాణ తల్లి తెగ మురిసిపోతుంది. సహజత్వం, సజీవత్వం, కళాతత్వం కలగలిసిన త్రివేణి సంగమంలా అతని చిత్రాలు మనసులకు విందుచేస్తాయి. కూరెళ్ల శ్రీనివాస్ జన్మస్థలం నల్లగొండ. తల్లిదండ్రులు లక్ష్మయ్య, సావిత్రమ్మ. విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన తండ్రి కళావారసత్వం, తల్లి కరుణా గుణం శ్రీనివాస్ అందిపుచ్చుకున్నాడు. కులవృత్తి గతమైన మౌలిక కళాప్రతిభతో తనను తాను పుటం బెట్టుకొని బంగారం లాంటి చిత్రకారుడిగా, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రఖ్యాతిగాంచాడు.
వడివడిగా అడుగులు వేసి…
దళిత, బహుజనుల, గిరిజనుల, స్వేద, రక్త, అశ్రుధారల్లో నుండిహొసమస్త కళలు పురుడుపోసుకున్నాయి. వీరి శ్రమైక జీవనమే కళలకు బొడ్డుకోసిపేరుహొపెట్టింది. క్రమంగా ప్రాబల్య వర్గాలు వీటిని అందిపుచ్చుకొన్నారు.హొఅందుకేహొ ఈ వర్గాలహొసంస్కతిహొసంప్రదాయాల కేంద్రంగాహొసహజంగానే తొలిదశలోహొకళలు రూపు దిద్దుకున్నాయి. ప్రధానంగా 80వ దశకం తర్వాతహొ కళా, సాహిత్యరంగాల్లోహొకింది వర్గాలహొప్రభావం స్పష్టంగా కనబడుతుంది. అసాధారణ ప్రతిభతో,హొవామపక్షహొ ఉద్యమాల ఎరుకతోహొఆర్టిస్టు మోహన్ తెలుగు చిత్ర కళను ప్రజా పోరాటాల వైపు మలుపుతిప్పాడు.హొకాపు రాజయ్య,హొవైకుంఠం లాంటివాళ్ళు తెలంగాణతనంతోహొచిత్ర కళకు కొత్త ఊపిరి పోశారు. ఈ కళా ఒరవడినిహొఏలే లక్ష్మణ్‌హొమరింత పరాకాష్టకు తీసుకెళ్లాడు. దళిత, బహుజన జీవనశైలిని అక్బర్ తనచిత్రాల్లో సముచితంగా ఆవిష్కరించాడు.
ఈ ప్రేరణతోహొతన ప్రత్యేక శైలితో కూరెళ్ళ శ్రీనివాస్ తెలుగు కాన్వాస్ పైకి దూసుకొచ్చాడు. కుటుంబ సభ్యుల స్ఫూర్తితోహొప్రాణ మిత్రులైనహొకార్టూనిస్టు శంకర్, యస్ రఘు, కంబాలపల్లి శేఖర్‌ల సాంగత్యంలో, గురువుల ప్రోత్సాహంతో నల్లగొండహొకళా సాహిత్య వాతావరణంలోహొకార్టూనిస్టుగా, చిత్రకారుడిగాహొవడివడిగా అడుగులు వేశాడు. తొలిదశలో కార్టూన్‌లు వేసిన శ్రీనివాస్, అనంతరం చిత్ర కళ దిశగా దృష్టి సారించాడు. చందమామ పత్రికలో అందమైన బొమ్మలు చూసి శ్రీనివాస్ కళాభిరుచిని పెంపొందించుకున్నాడు. తల్లి బిడ్డకు పాలిచ్చినట్లు, రైతు పొలంలో విత్తనాలు చల్లినట్లు అంతే ఏకాగ్రతతో, బాధ్యతతో బొమ్మలు వేయడం సాధన చేసి గొప్ప చిత్రకారుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.
వాచకాలకు దృశ్య భాష్యం
క్రాఫ్ట్ టీచరర్‌గా, తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా, ప్రధానోపాధ్యాయుడుగా శ్రీనివాస్ విద్యా రంగానికి విశేష సేవలందించాడు. పాఠశాల, ఇంటర్ మీడియట్ వాచకాల రూప కల్పనలో సంపాదక మండలికి చిత్రకారుడిగా కొంగు బంగారంగా నిలిచాడు. పాఠ్య పుస్తకాలకోసం వేలాదిబొమ్మలు వేసి అరుదైన రికార్డు సష్టించాడు. పాఠాల సారాంశాన్ని సునిశితమైనహొనైపుణ్యంతో బొమ్మల్లోకి తర్జుమా చేయడంలో అపార ప్రతిభా సామర్ధ్యాలను ప్రదర్శించాడు. చిన్నారుల అవగాహనా పరిధిని గ్రహించి, విద్యార్థి విధేయంగా బొమ్మలు వేసి విద్యావేత్తల, ఉన్నతాధికారుల హొప్రశంసలందుకున్నాడు. తెలుగుతో పాటు సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, హిందీ వాచకాలకు కూడా భావగర్భితమైన చిత్రాలు వేసి, పాఠాలకు ఔచితీమంతమైన దృశ్య భాష్యం చెపాడు. చివరికి పాఠశాల గోడలపై కూడా నైతిక ప్రబోధాత్మకమైన బొమ్మలువేసి విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాస స్ఫూర్తిని కలిగించాడు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థకు మూడు దశాబ్దాల పాటు ఆయన ఆస్థాన చిత్రకారుడిగా అసాధారణ సేవలు అందించాడు.
కోటి రత్నాల వీణకు కుంచెత్తి జై కొట్టిన చిత్రకారుడు
ప్రజాపోరాటాల ధ్యేయాలను, సామాజిక ఉద్యమాల ఆశయాలను విసృతంగా ప్రచారం చేయడంలో చిత్రకారుడిగా అతను నిర్వహించిన పాత్ర బృహత్తరమైనది. వామపక్షవాదులు, ప్రజాస్వామ్య వాదులు నిర్వహించే వందలాది సదస్సులలో, ఈ సందర్భంగా ప్రచురించే కరపత్రాలలో, పోస్టర్స్ లో శ్రీనివాస్ వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యకర్తలకు, ప్రజలకు భావజాల స్ఫూర్తిని కలిగించాయి. ‘కోటి రత్నాల వీణ’ ఆలపించిన విముక్తి గీతానికి శ్రీనివాస్ ‘కుంచెత్తి’ జై కొట్టాడు.హొతెలంగాణ భౌగోళిక, చారిత్రిక, సాంస్కతిక, సాహిత్య, కళా వైభవ ప్రాభావాలను, నిసర్గ సుందరమైన తెలంగాణ గ్రామీణ జీవన శైలిని, కూరేళ్ల శ్రీనివాస్‌హొఅద్భుతంగా తన చిత్రాల్లో బంధించాడు. తెలంగాణ అస్మితను, జీవన తాత్త్వికతనుహొతన రేఖా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలంగాణ సాహితీ లాంటి సంస్థలు ఏర్పాటు చేసిన సాహిత్య ఉత్సవాలలో శ్రీనివాస్ వేసిన వైతాళికుల చిత్రాలు ఎప్పటికీ మరిచిపోలేనివి.
అపురూప దృశ్య శతక కారుడు
ఉపద్రవాలెన్ని చుట్టూ ముట్టినా ఎత్తిన కుంచె దించకుండా ప్రజ్ఞా నిధిలా కళావిధిలో నిరంతరం నిమగమయ్యాడు. ‘చిత్ర కర్మన కర్తవ్యమాత్మ స్వగృహే నృపా’. చిత్రకారుడు తన ఇంట్లో స్వయంగా చిత్రకర్మ చేయరాదుహొఅని విష్ణు ధర్మోత్తర పురాణం శాసించింది. అర్థం పర్థంలేని ఈహొ పుక్కిటి పురాణ శాసనాన్ని ధిక్కరించి కరోన నేపథ్యంలో ఇంటినేహొ చిత్రకళాశాలగా మార్చుకున్నాడు. కోవిడ్ తిమిరంలో భయం భయంగా అందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నప్పుడు, శ్రీనివాస్ ప్రాణాలను కుంచెలో పెట్టుకొనిహొచిత్రకళను శ్వాసిస్తూ జీవించాడు. వలస కార్మికుల వలపోతను, పారిశుద్ధ్య కార్మికుల శ్రమైక జీవన ఔన్నత్యాన్ని, వైద్య సిబ్బంది త్యాగ నిరతిని తన చిత్రాల ద్వారా తేట తెల్లం చేశాడు. సమాజంలో ప్రభావశీలమైన పాత్రపోషించిన స్ఫూర్తి ప్రదాతలను, ఉద్యమకారులను,హొకవులను, కళాకారులను సాహితీవేత్తలను, నాయకులను, పాత్రికేయులను, ఆప్తమిత్రులను యాదిజేసుకొని వారిరూపు రేఖా విలాసాలనుహొనీటి రంగుల చిత్రాల్లో రసరమ్యంగా రాశిపోశాడు. పగలంతా పాఠశాలలో విద్యను బోధించి, సాయంత్రం తన చిత్రకళాశాలలో బొమ్మలను దించటం దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతి సాయంత్రం చిత్రావధానం చేశాడు. 108 రోజుల పాటుహొశ్రమించి 108 మంది చిత్రాలను రూపొందించాడు. విలువైన ఈ రికార్డుతో శ్రీనివాస్ ఒక అపూర్వ దశ్యశతకాన్ని ఆవిష్కరించాడు.
తెలుగు భాషోపాధ్యాయుడు…
శ్రీనివాస్ కవిత్వాన్ని కూడా అమితంగా ఆస్వాదిస్తాడు. కవులతో కళాకారురాలతోనే అతని చుట్టరికం. అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తాడు. మనోనేత్రంతో దర్శిస్తే ఆయన చిత్రాల్లో కవిత్వం ఉంటుంది. ఆచంచలమైన ఓపికతో, సృజన ఎరుకతో వందలాది కవితా సంపుటులకు, సంకలనాలకు, ఇతర గ్రంథాలకు అందమైన ముఖ చిత్రాలు వేశాడు. వందల కవితలు చేతికందించి ఒక్కరోజులో ప్రతి కవితకు బొమ్మవేసి ఇవ్వాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తే కూడా అతను ఏమాత్రం ఆలోచించకుండా చిరునవ్వుతో ఒప్పుకుంటాడు. దీని కోసం కష్టాలను ఇష్టంగా కొని తెచ్చుకుంటాడు. ముఖ్యంగా కొత్తతరం కవులకు ఆయన తలలోని నాలుకల విలసిల్లాడు. వినూత్నంగా మొగ్గ తొడుగుతున్న వారి సజనలతలకు బొమ్మల పందిరి వేశాడు. గాలి పీల్చకుండా బతకలేనట్లే శ్రీనివాస్ బొమ్మలు వేయకుండా జీవించలేడు. అందుకే జీవితాన్ని చిత్ర కళకు అంకితం చేశాడు.
కళా భాగస్వామిగా…
కొంతమంది చిత్రాలు ససేమిరా అంతుపట్టవు. కొన్ని బొమ్మలు వేసేదాకా చిత్రకారునికి, వేసినాక అతనికి అర్థం కావు. కానీ కూరెళ్ళ చిత్రాలు హొఅమ్మలా మనతో మాట్లాడతాయి. హృదయానికి సేదతీరుస్తాయి. అతని చిత్రాల్లో తెలంగాణ వ్యాకరణం ఉట్టిపడుతుంది. ప్రగతిశీల తాత్త్వికత, అస్తిత్వ ఉద్యమాల స్ఫూర్తి కనిపిస్తుంది. బొమ్మల కోసం బేరమాడటం శ్రీనివాస్‌కి బొత్తిగా చేతగాదు. ఆయన ప్రతిభతో వ్యాపారం చేయలేదు. కళా ప్రతిభతో తన జీవితానికి లోకోత్తరమైన సౌందర్యాన్ని సమకూర్చుకున్నాడు. కళాకారులకు ఈ సౌందర్యమే కదా అసమాన సౌభాగ్యం. కూరెళ్ళ శ్రీనివాస్ కళాయాత్రలో ఆయన సతీమణి శైలజ పాత్ర వెలకట్టలేనిది. శ్రీనివాస్ సృజన తపస్సుకు అవసరమైన ఏకాంతాన్ని, మానసిక ప్రశాంతతను అందించి, అతని విజయానికి ఆలంబనగా నిలిచింది. భర్తను ప్రేమించడమంటే అతని కళారాధనలో మమేకం కావడమే అని విశ్వసించి, జీవిత భాగస్వామిగానే కాకుండా కళా భాగస్వామిగా ఆయన వెంటనడిచింది. ఉన్నతోద్యోగులైన కూరెళ్ళ శ్రీనివాస్ కుమారులు తండ్రి స్థిరాస్తుల కోసం ఆరాటపడకుండా, ఆయన ‘చిత్ర’ ఆస్తులకోసం పరితపించారు. శ్రీనివాస్‌హొచిత్రాలు చూసినప్పుడు అందరూ ‘క్యా సీన్ హై’ అనకుండా ఉండలేరు. అంతేకాదు ‘క్యా ‘శ్రీను’ హై’ అని కళానందంతో మురిసిపోతారు.
(నేడు జూలై 12) హైదరాబాద్, సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కూరెళ్ళ శ్రీనివాస్ 5 గ్రంథాల ఆవిష్కరణ సభ సందర్భంగా)
ప్రొ|| కోయి కోటేశ్వర రావు, 94404 80 274


