అంగన్వాడి టీచర్లకు శిక్షణ కేంద్ర శిబిరం…

– జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి అంగన్వాడి  ప్రాజెక్టు పరిధిలో ఉన్న 11 సెక్టార్లు లో నుంచి 35 మంది అంగన్వాడి టీచర్లను బ్యాచ్ గా డివైడ్ చేసి జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పూర్వ ప్రాథమిక శిక్షణా కేంద్రం శిబిరం నిర్వహించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు.  ఈ శిబిరంలో భాగంగా 35 మంది టీచర్లకు ప్రియదర్శిని అంగన్వాడి టీచర్ కరదీపిక పుస్తకాలు అందించి. అందులోని అంశాలు నూతన జాతీయ విద్యా విధానం 2020లో ప్రీస్కూల్ అనుసంధానం చేయడం జరిగిందనీ, ఈసిసిఈ, ఈసీఈ గురించి వివరించడం, అభ్యసనమూలాలు, ఆటలు, పాటలు, కథ, మాటలు, మంచి అలవాట్లు, సృజనాత్మకత, మరియు శాస్త్రీయ పరిజ్ఞానం ప్రదర్శించడం జరిగిందనారు.  మిగతా 267 టీచర్లకు బ్యాచిలుగా విభజించి శిక్షణ నిర్వహించడం జరుగుతుందనారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, భువనగిరి ప్రాజెక్టు సిడిపిఓ స్వరాజ్యం, రేఖల , ఏసి డిపో రమా, సెక్టార్ సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Spread the love