Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో డీఈవోల బదిలీలు

తెలంగాణలో డీఈవోల బదిలీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖలో అధికారుల, బోధనేతర సిబ్బంది బదిలీలు ఆన్‌లైన్ ద్వారా విజయవంతంగా పూర్తయ్యాయని డైరెక్టర్ నవీన్ నీకోలస్ ఆదివారం తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా పలువురు జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో) స్థానాలు మారాయి. మేడ్చల్ డీఈవో విజయకుమారి మహబూబ్‌నగర్‌కు, వికారాబాద్ డీఈవో రేణుక మేడ్చల్‌కు, హైదరాబాద్ డీఈవో రోహిణి సంగారెడ్డికి, రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావు నల్గొండకు, నల్గొండ డీఈవో బి. భిక్షపతి యాదాద్రి భువనగిరికి బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా రేవతి రెడ్డి, హైదరాబాద్ జిల్లా నూతన డీఈఓగా వెంకటేశ్వర్లు, సిద్దిపేట జిల్లా డీఈఓగా శాస్త్రి నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -