నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 134వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమానికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలని కోరారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.ముఖ్యంగా పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పసుపు బోర్డును ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు నాణ్యమైన పసుపు ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుర శ్రీకాంత్, మన్ కీ బాత్ ఇంచార్జి బండారు యాదగిరి, మండల ఉపాధ్యక్షుడు డాక్టర్ అరుణ్, కల్లెడ సర్పంచ్ సుష్మిత-ప్రళయ్, సుభాష్, ఎర్రం రమేష్, నడిసరం మల్లయ్య, అఖిలేష్, ప్రమోద్, గణేష్, తొర్లికొండ సాయన్న, మామిడి గంగారెడ్డి, సురేష్ గౌడ్, మగ్గిడి గంగారెడ్డి, శివకేశవులు తదితరులు పాల్గొన్నారు.
మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



