Monday, September 14, 2026
E-PAPER
Homeజిల్లాలుబెస్ట్ అవైలబుల్ స్కూల్ డ్రా పారదర్శకంగా నిర్వహణ:అదనపు కలెక్టర్ విక్టర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ డ్రా పారదర్శకంగా నిర్వహణ:అదనపు కలెక్టర్ విక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఐడీఓసీ ప్రజావాణి హాల్‌లో గురువారం బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS) డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో పారదర్శకంగా ప్రవేశాల కేటాయింపు కోసం డ్రా ప్రక్రియ చేపట్టినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటిడబ్ల్యూఓ సౌజన్య, సంబంధిత శాఖల అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -