– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్:
ఐపీఎల్-18వ సీజన్ టికెట్ల విక్రయం పూర్తి పారద్శకంగా చేపడతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు స్టేడియంలో ఐపీఎల్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టిక్కెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని, స్టేడియంలో విక్రయించే ఆహార పదర్థాలు నాణ్యత బాగుండాలని, అధిక రేట్లకు విక్రయించవద్దని సన్‌రైజర్స్‌కు జగన్ సూచించారు. డ్రెసింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో జరుగుతున్న పనులను ఉపాధ్యక్షుడు దల్జిత సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ కుమార్ తో కలిసి జగన్ మోహన్ రావు పర్యవేక్షించారు. ఈ సమావేశంలో బీసీసీఐ నుంచి వైభవ్, యువరాజ్, హెచ్‌సీఏ సీఈఓ సునీల్, ఎస్‌ఆర్‌హెచ్ నుంచి శరవణన్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.