హాకీ ప్లేయర్‌ జ్యోతికి సన్మానం

Tribute to hockey player Jyotiహైదరాబాద్‌: భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి ఈదుల జ్యోతి రెడ్డిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) చైర్మన్‌ కే. శివసేనా రెడ్డి శనివారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. భారత జట్టు శిక్షణ శిబిరానికి ఎంపికైన జ్యోతి.. ఆసియా హాకీ చాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత జట్టులో చోటు సాధించాలని శివసేనా రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ హాకీ కెప్టెన్‌గా జ్యోతి జాతీయ స్థాయిలో రాణించింది. జూనియర్‌ వరల్డ్‌కప్‌, ఖేలో ఇండియా క్రీడల్లో సత్తా చాటి జాతీయ జట్టు తరఫున అరంగ్రేటం చేసేందుకు ఎదురుచూస్తోంది. శాట్‌ తరఫున జ్యోతికి పూర్తి సహకారం అందిస్తామని శివసేనా రెడ్డి హామీ ఇచ్చారు.

Spread the love