టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరణ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టయిన నిందితుడు రాజశేఖర్‌ రెడ్డికి బెయిల్‌ను నాంపల్లి కోర్టు గురువారం నిరాకరించింది. టీఎస్సీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో రాజశేఖర్‌రెడ్డిని దాదాపు 20 రోజుల క్రితం సిట్‌ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ల పర్యవేక్షణాధికారిగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్‌రెడ్డి చైర్మెన్‌ పీఏ అయిన ప్రవీణ్‌తో కుమ్మక్కై పేపర్‌ లీక్‌కు పాల్పడినట్టు సిట్‌ అధికారులు అతనిపై అభియోగాలు మోపారు.

Spread the love