తుడుం దెబ్బ బహిరంగ సభను జయప్రదం చేయండి…

– ఎమ్మార్పీఎస్ జాతీయ నేత నెమలి నర్సయ్య పిలుపు 
నవతెలంగాణ- గోవిందరావుపేట
చలో ఇల్లందు ఈ నెల 17 న ఇల్లందు లో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ డిమాండ్ కై నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత నెమలి నరసయ్య  పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో కొమరం భీమ్ చౌరస్తాలో తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గొంది కిరణ్ ఆధ్వర్యంలో చలో ఇల్లందు ఆదివాసి బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నరసయ్య మరియు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ లు హాజరై మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు పద్మశ్రీ మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు.పద్మ శ్రీ మంద కృష్ణ పోరాటంతో  గత సం.,రం  ఆగస్టు ఒకటో తారీకు రోజున గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపకులాల్లో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ పై కమిషన్ నియమించాలని షెడ్యూల్ తెగలలో  విద్య ఉద్యోగ సంక్షేమ ఉపాధి, రాజకీయాల్లో ఒకే వర్గానికి సంబంధించిన వారు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఉద్యోగ అవకాశాల్ని పొందుతున్నారని 33 తెగల్లో ఉన్న అత్యంత వెనుక బడిన  ఉన్న ఆదివాసి కోయ, గోండు కోలాం లకు  ఉప కులాలైన, ఆదివాసి నాయకపోడ్ లు నష్టపోతున్నారని ప్రధానంగా  వేరే రాష్ట్రాలలో బీసీలుగా,ఎస్సీలుగా ఓసీలుగా, ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఎస్టీలుగా ఆమోదించక గుర్తించబడ్డ వలసవాదులు లక్షలాదిమంది చుట్టుపక్క రాష్ట్రాల నుంచి వచ్చి అట్టడుగున అణగారిన వర్గం గా ఉన్నటువంటి ఆదివాసీల విద్యా, ఉద్యోగ, సంక్షేమ ఉపాధి,రాజకీయ రంగాల రిజర్వేషన్లను దోచుకుంటున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లో షెడ్యూల్ కులాలలోని 59 కులాలను ఉపకులాలతో ఆ కులాలలో అసమానతలు ఉన్నట్టుగానే షెడ్యూలు తెగలలో ఒకటి రెండు తెగలు మాత్రమే అన్ని రంగాలలో ముందు ఉన్నాయని మిగతా 31 తెగలకు అన్ని రంగాలలో నష్టం జరుగుతుందని నేటికీ ఆదివాసి లలో పదవ తరగతి కూడా చదవని తెగలు ఉన్నాయంటే భారతదేశాని కే అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు దాని కనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూలు తెగలలో కూడా వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి షెడ్యూలు తెగలను ఏ బీసీడి లుగా వర్గీకరించి వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ BR అంబేద్కర్ గారి 5 వ షెడ్యూల్ ను అనుసరించి ఆదిమ మూలవాసులైన ఆదివాసి తెగలకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము  ఎస్టి వర్గీకరణ కమీషన్ నియమించి ఆదివాసి తెగలకు సంపూర్ణ న్యాయం చేకూర్చాలని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక పోడ్ హక్కుల పోరాట సమితి నాయకపోడ్ దెబ్బ  వ్యవస్థాపక పోలిట్ బ్యూరో సభ్యులు బొల్లెం
 సారయ్యనాయక పోడ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్  జిల్లా కార్యదర్శి ఈక జగ్గారావు ఆదివాసి ఉద్యోగుల సంఘం సీనియర్  నాయకులు ఆన్నెబోయిన కేశవరావు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యనగoధుల మొగిలి పసర మాజీ సర్పంచ్ ముద్దబోయిన రాము మండల నాయకులు చింత విజయ్, వెంకట్ ప్రసాద్,
 అంబేద్కర్ భవన్ విగ్రహ నిర్మాణ సమితి కోర్ కమిటీ సభ్యులు నక్క బుచ్చన్న, ఆదివాసీ మహిళ సంఘం జిల్లా నాయకురాలు  సువర్ణపాక లక్ష్మీ,  చింత మెనకబెడీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love