– నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్న మనోహర్ రెడ్డి
– పార్టీ టికెట్ తనకే వస్తుందని అప్పుడప్పుడు తాండూరుకొస్తున్న కేఎల్‌ఆర్
– అభ్యర్థి ఎవరో తెలియక నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన
– కాంగ్రెస్‌లో ఎవరీ తీరు వారిదే..
– రెండు మూడు రోజుల్లో ఫైనల్ కానున్న తాండూరు, కాంగ్రెస్ టికెట్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్‌లో ఇద్దరు నాయకులు పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టికెట్ తమకే వస్తుందని ఇద్ద రు నాయకులు నియోజకవర్గంలో చెప్పుకొస్తున్నారు. తాండూర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్ర మాలతో బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజల్లోకి దూ సుకుపోతున్నారు. వివిధ మండలాల్లో సమా వేశా లు నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ ముఖ్యమైన నాయకులను కలుస్తూ ప్రచారం ముమ్మరం చేశారు. తాండూరు నియోజకవర్గం పార్టీ తనకే వస్తుందని బుయ్యని మనోహర్ రెడ్డి నియోజకవర్గవంలో వివిధ గ్రామా లకు చెందిన సర్పంచులను పలువురిని ఇదివరకే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్పించారు. కేఎల్‌ఆర్ మాత్రం టికెట్ తనకే వస్తుందని నామమాత్రంగా అప్పుడప్పుడు తాండూరు వస్తు నాయకులను కలుస్తూ వెళుతు న్నారు తప్ప పూర్తి స్థాయిలో కార్యక్రమాలను ము మ్మరం చేయడం లేదు. తాండూరు పార్టీ అభ్యర్థి ఎవరో తెలియక రెండవ శ్రేణి నాయకులు, కార్య కర్తలు ఆందోళనకు గురవుతున్నారు. తాండూరు నియోజకవర్గం టికెట్ ఎవరికి వస్తుందో ఎవరికీ రా దో తెలియక కార్యకర్తలు అయోమయానికి గుర వుతున్నారు. తాండూరు నియోజకవర్గంలో పార్టీ లో ఇద్దరు నాయకులు బయటి వాళ్లు కావడంతో టికెట్ ఎవరికి అనేది కార్యకర్తలు పార్టీ అభిమా నులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల వాతావరణం నెలకొన్న ఇప్పటినుండి తాండూరు కాంగ్రెస్‌లో రోజు కొత్త పరిణామాలు నెలకొంటు న్నాయి. ఈ మధ్యకాలంలో తాండూర్ నియోజక వర్గంలో సీనియర్ నాయకులైన డాక్టర్ సంపత్ కు మార్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాండూర్ నియోజకవర్గంలోని యాలాల మండల పరిధిలో ఉన్న ఆర్బిఎల్ కంపెనీ యజమాని వ్యా పారవేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యకాలం లో కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మనోహర్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని పలువురిని కలుస్తున్నారు. ఎన్నికల పోటీలో ఉంటానని పార్టీ టికెట్ బుయ్యని మనో హర్ రెడ్డికే వస్తుందని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న నాయకులందరూ ఎవరు రీతిలో వా రు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్య క్రమాలు ఎవరు తీరు వారిది అన్న చందంగా కొన సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కాంగ్రెస్ అధి ష్టానం తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికీ అనేది ప్రకటించకపోవడంతో తాం డూర్ పార్టీలో అయోమయం నెలకొంది. ఇప్పటికై నా పార్టీ అధిష్టానం. మేల్కొని తాండూరు నియో జకవర్గం పార్టీ అభ్యర్థి ఎవరనేది త్వరగా ప్రకటిం చాలని పలువురుఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.