రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి

ఎదులాపురం (మహారాష్ట్ర) : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని పాండ్రకవాడ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని వైద్య విద్యార్థులు వెళుతున్న బైక్‌ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వైద్య విద్య ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బాలసాయి, డేవిడ్‌లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love