రారుగఢ్‌ అగ్ని ప్రమాదం

– ఎనిమిది మృత దేహాల వెలికితీత
ముంబయి : మహారాష్ట్రలోని రారుగఢ్‌ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగిన ఒక ఫార్మా కంపెనీ నుంచి ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. శుక్రవారం మధ్యాహ్నాం అగ్ని ప్రమాదం జరిగినా ఈ వార్తను రారుగఢ్‌ పోలీసులు ఆలస్యంగా విడుదల చేశారు. ఈ ప్రమాదం జరిగిన నుంచి 11 మంది గల్లంతయ్యారని ఉద్యోగులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మిగిలిన ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇంకా వీరి ఆచూకీ లభించలేదు. జిల్లాలోని ఎంఐడిసి మహద్‌లోని బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ అనే పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం.. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయి. వీటితో పరిశ్రమలోని రసాయనాలతో నిండిన బారెల్స్‌ పేలడంతో మంటలు మరింత తీవ్రంగా మారాయి.

Spread the love