అసోం సీఎం భార్యకు అడ్డగోలుగా లబ్ది

– కేంద్ర పథకం కింద రూ.10 కోట్ల సబ్సిడీ
– వ్యవసాయ భూమి పారిశ్రామిక భూమిగా మార్పు
– హిమంత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్‌
గువహటి : బీజేపీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు ఆయాచిత లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద రినికి భుయాన్‌ శర్మ రూ.10కోట్లు సబ్సిడీ పొందారు. దాంతోపాటు నాగన్‌ జిల్లా కలియాబార్‌ ఏరియాలో వంద బీఘాలకు పైగా భూమిని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేసి, పారిశ్రామిక భూమిగా మార్చుకుని కోట్లాది రూపాయల ప్రయోజనం పొదారు. స్థానిక మీడియాలో ఇందుకు సంబంధించిన కథనం ప్రచురితమైంది. రినికి భుయాన్‌ శర్మ నేతృత్వంలోని ప్రైడ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని పొందింది. కలియాబార్‌ ఏరియాలో మరో 50 బీఘాల స్థలాన్ని కూడా ఆమె పొందారు. ఇదంతా జరిగింది 2022లో. ఆప్పుడు ఆ భూమిని వ్యవసాయ భూమిగా వర్గీకరించారు. ఆ తర్వాత ఆ భూమి కేటగిరీ పారిశ్రామిక భూమిగా మారిపోయింది. సీలింగ్‌ చట్టం కింద ఒక వ్యక్తి లేదా కంపెనీ 49.5 బీఘాల కన్నా వ్యవసాయ భూమిని కలిగివుండరాదరి క్రాస్‌ కరంట్‌ రిపోర్ట్‌ పేర్కొంది. పైగా ఈ ఏడాది జులై 1న మరో 56 బీఘాల భూమిని ముఖ్యమంత్రి భార్య కొనుగోలు చేశారు. రినికి శర్మ నేతృత్వంలోని మీడియా హౌస్‌ వంద బీఘాలకు పైగా భూమిని కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఆగ్రో పరిశ్రమను నెలకొల్పుతున్నామంటూ ఆహార ప్రాసెసింగ్‌ శాఖ నుంచి రూ.10 కోట్లు సబ్సిడీకూడా పొందింది. కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గొగోరు దీని గురించి ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం బయటకు వచ్చింది. కేంద్ర సబ్సిడీ కింద రూ.10కోట్లు అందుకోవడానికి సంబంధించిన పత్రాన్ని కూడా ఆయన చూపించారు. కేంద్ర ప్రభుత్వం నుండి తాము ఎలాంటి సబ్సిడీ పొందలేదని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. పైగా ఈ ఆరోప ణలు రుజువైతే ఆ మరుసటి రోజే రాజీనామా చేస్తానని అన్నారు. తొలుత స్థానిక మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాన్రానూ పెద్ద వివాదంగా మారడం తో ఇక దానిపై దృష్టి పెట్టింది.
రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తా : రినికి శర్మ
కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, బిజెపి ఎంపి దాస్‌ పేర్లు కూడా పెట్టండి : గొగోరు
ఈలోగా గౌరవ్‌ గొగోరు చేస్తున్న రగడకు ఆయనపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని రినికిశర్మ హెచ్చరించారు. అదే గనుక జరిగితే ఆ పరువు నష్టం దావా పత్రంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, అస్సాం బిజెపి ఎంపి పల్లవ్‌ లోచన్‌ దాస్‌ల పేర్లు కూడా పెట్టా ల్సిందిగా గొగోరు కోరారు. పార్ల మెంట్‌లో దాస్‌ అడిగిన ప్రశ్నకు సమా ధానం చెబుతూ గోయల్‌ ఈ విష యాన్ని బయటపెట్టారని తెలిపారు.
ఆదివాసీల పేరుతో ఆస్తుల విస్తరణ ?
ఆదివాసీల పేరుతో ఆస్తులను విస్తరించుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భావిస్తున్నారని అంకాలిక్‌ గణమోర్చాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అజిత్‌ భూయాన్‌ విమర్శించారు. అక్కడ వున్న ముస్లి ములతోపాటు హిందువులు, గిరిజను లందరినీ బలవంతంగా తరలించి, తన కుటుంబ సభ్యుల ఆస్తులను విప రీతంగా పెంచుకున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగు ణంగా తరలింపులు వుంటే ఆమోద యోగ్యమే కానీ హిమంత ప్రభుత్వం న్యాయానికి సంబంధించిన అన్ని చట్టాలను దారుణంగా ఉల్లంఘించిం దన్నారు. హిమంత సిఎం అయ్యాకా… ఆయన ఆస్తులు కలియాబార్‌లోనే కాకుండా అనేక ప్రదేశాల్లో రిసార్ట్‌లు, వాణిజ్య సముదాయాలు, టీతోటలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. గౌహతి హైకోర్టుతోసహా ప్రభుత్వ కార్యాలయాలను ఉత్తర గౌహతికి మార్చాలని ప్రతిపాదించారని చెప్పా రు. ఆ ప్రాంతాన్ని అర్బన్‌ సెక్టార్‌గా వర్గీకరించారని, తమ కుటుంబ లబ్ధికోసమే సిఎం ఇదంతా చేస్తున్నా రని చెప్పారు.
సీఎం రాజీనామా చేయాలి : కాంగ్రెస్‌ ఎంపీ
ఈ సబ్సిడీ వివాదంపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సబ్సిడీల నేవి వాస్తవంగా అవసరమున్న రైతుల కు, స్థానిక పారిశ్రామికవేత్తలకు అంద జేయాలి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.
ఈ లావాదేవీలన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకతను పాటిస్తూ, నైతిక ప్రమాణాలు పరిరక్షిస్తూ దర్యాప్తు సాగించాల్సిన అవసరముందన్నారు.
భార్య మీడియా సంస్థకు వ్యాపారాలుంటే తప్పేంటి? : సీఎం ఎదురుదాడి
ఈవిషయంలో ఇప్పటివరకు రక్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిన సీఎం శుక్రవారం ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు వేరే వ్యాపా రాలున్నాయని, అలాంటి సమయంలో ప్రైడ్‌కు వుండడంలో తప్పులేదని అన్నారు. ప్రజలు తనపై దాడి చేస్తే పరవాలేదు, కానీ స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన తన భార్యను ఈ వివాదంలోకి ఎందుకు లాగుతారని ప్రశ్నించారు.

Spread the love