ఎంవీఏ ఐక్యంగా ఉంది : శరద్‌ పవార్‌

ముంబయి : మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ)లో ఎలాంటి గందోరగోళం లేదని, ఐక్యంగా ఉందని ఎన్‌సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌ సోమవారం స్పష్టం చేశారు. ఈ నెల 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబయిలో జరిగే ఇండియా కూటమి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశం నిర్వహించే బాధ్యతలను తను, ఉద్ధమ్‌ ఠాక్రే, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులు నానా పటోలే తీసుకున్నట్టు చెప్పారు. సమావేశం విజయవంతంగా జరిగేటట్లు చూస్తామని అన్నారు. ఇటీవల శరద్‌ పవార్‌తో ఎన్‌సీపీ చీలక నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భేటీ జరిగిన తరువాత నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు శరద్‌ పవార్‌ పై విధంగా సమాధానం ఇచ్చారు.

Spread the love