అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్త కోర్సులకు అనుమతి
ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఎస్‌డబ్ల్యూ, ప్రొఫెషనల్ కోర్సులు
త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో అధిక డిమాండ్ ఉన్న ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. యూజీసీ ఆమోదం పొందిన కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), ఎంఎస్‌సీ (జియోగ్రఫీ)తో పాటు బీఈడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుకు అనుమతి పునరుద్ధరణ ఉన్నట్టు చెప్పారు.
జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ విధానంలో విశ్వవిద్యాలయాన్ని పరిశీలించి మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలను సమీక్షించిన అనంతరం ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందన్నారు. కొత్త కోర్సులకు అనుమతి లభించడంలో తెలంగాణ ప్రభుత్వ సహకారం కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా సూచనల మేరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక విద్యా కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. వాటికే యూజీసీ ఆమోదం లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, యూజీసీకి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), బీఈడ్ (సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం) కోర్సులు ఉపాధ్యాయుల విద్యార్హతలు, నాయకత్వ లక్షణాలు, పాఠశాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొం దించడంలో దోహదపడతాయని తెలిపారు. ఈ కోర్సుల అమలుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), ఎంఎస్‌సీ (జియోగ్రఫీ) కోర్సులు ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న పీజీ కోర్సులని పేర్కొన్నారు. ఈ కొత్త కోర్సుల అర్హతలు, ప్రవేశ విధానం, ఫీజులు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులు తాజా సమాచారం కోసం వెబ్‌సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించాలని, లేదా హెల్ప్ డెస్క్ 040 – 23680 333 / 555 లో సంప్రదించాలని సూచించారు.
ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



