Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నస్థాయి రైస్ మిల్లర్లకు 
అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

చిన్నస్థాయి రైస్ మిల్లర్లకు 
అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని చిన్న స్థాయి రైస్ మిల్లర్లకు తాము అండగా ఉంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆమె రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంత రం ఒక ప్రకటన విడుదల చేశా రు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొన కుండా, 8 నుంచి 10 కిలోలు తరుగు పేరుతో దాదాపు రూ.2 వేల కోట్ల రూపా యలను ఇందులో స్కామ్ చేసిందని ఆరోపించారు. పెద్ద రైస్ మిల్లర్లతో కుమ్మ క్కై చిన్న రైస్ మిల్లర్లను వేధిస్తున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు ప్రభుత్వానికి బకాయిపడ్డ వారిని వదిలేసి, రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లను దొంగలుగా చూస్తున్నారని తప్పు పట్టారు. కరీంనగర్ లో ఒక మహిళ చనిపోయినా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి లక్షా 40 వేల టన్నుల దొడ్డు బియ్యం ఉన్నాయనీ, నాడు కిలోకు రూ. 48 చొప్పున అమ్మితే, ప్రస్తుత ప్రభుత్వం రూ.24 కిలో కు అని టెండర్ పెట్టి,కొన్ని రోజులకే మళ్లీ రూ. 21.70 కే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ బియ్యానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ 10 వేల టన్నులు ధాన్యాన్ని లిప్ట్ చేశారని ఆరోపించారు. పెద్ద మిల్లర్లకు ఇచ్చిన ఆ బియ్యం టెండర్ ను చిన్న రైస్ మిల్లర్లకు అదే రూ. 21.70 లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ ఇవ్వాలని కోరారు. పెద్ద రైస్ మిల్లర్ల మిల్లులో నాలుగు సీజన్ల కు సరిపడా ధాన్యం ఉండాలనీ, దాదాపు 15 లక్షల టన్నులకు బదులుగా 5 లక్షల టన్నులు మాత్రమే ఉందని ఆమె విమర్శించారు.

​23 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జిలు
టీఆర్ఎస్ రాష్ట్రంలోని 23 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. 23 మందికి గానూ 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఐదు మంది ఓసీలు, ఒకరు ఎస్టీ నేత ఉన్నారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఇంచార్జిలను ప్రకటించనున్నట్టు చెప్పారు. కొత్త ఇంచార్జిలు పార్టీ పాంచజన్య సిద్ధాంతాన్ని ప్రతి గడపకు చేరవేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
​సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయకుంటే ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష చేస్తానని ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం ఇచ్చారు. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న కార్మికులు ఆందోళన చెందవద్దనీ, డిపెండెంట్ ఉద్యోగాల కోసం పెట్టుకున్న డేట్ నే ప్రామాణికంగా తీసుకునేలా పోరాటం చేస్తానని ఆమె భరోసానిచ్చారు. గెలిచిన సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాలను గంగలో కలుపుతున్న అడగటం లేదని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలన్నీ క్లియర్ అయ్యే వరకు నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -