రైతు సంఘం ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ స్రవంతి కి వినతి పత్రం

నవతెలంగాణ – శంకరపట్నం
రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మరెడ్డి రాజిరెడ్డి,ఆధ్వర్యంలో శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం కేడీసీసీ బ్యాంకు మేనేజర్ స్రవంతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దాని పూసే లేదని ఖరీఫ్ పంటలు వేసుకునే టైం వచ్చిందన్నారు.రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పెట్టు బడికి సరిపోను డబ్బులు అవసరం కాబట్టి ప్రభుత్వము వెంటనే రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే కల్తీ లేకుండా విత్తనాలు సప్లై చేయాలని అదేవిధంగా ఎరువులు,పురుగు మందులు, నకిలీ లేకుండా చూడాలని ఒకవేళ నకిలీ ఎరువులు విత్తనాలు పురుగుమందులు అమ్మిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా రైతులకు సరిపోను అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై ఇవ్వాలనని అదేవిధంగా పంట బీమాను అమలు చేయాలని అన్ని రకాల పంటలకు ఏ పంటకు ఏ విధంగా నష్టం వస్తుందో అదే విధంగా పంట బీమా ప్రభుత్వమే చేసి రైతులకు రషీద్ రూపకంగా ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫారస్ వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన పంటకు పెట్టుబడి కి రెండంతలు ధర నిర్ణయం చేయాలన్నారు.ఈ  కార్యక్రమంలో పిట్టల తిరుపతి, కాసు శివయ్య, రాములు,సమ్మయ్య,లు పాల్గొన్నారు.

Spread the love