సలీమ సారథ్యంలో..

Under the leadership of Salima..– ఆసీస్‌ టూర్‌కు హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా పర్యటనకు భారత హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ నెల 26 నుంచి మే 4 వరకు పెర్త్‌ హాకీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్లు మూడు మ్యాచుల సిరీస్‌లో తలపడనున్నాయి. మెగా సమరానికి ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు మ్యాచులు ఆడనున్న భారత మహిళల జట్టు.. సీనియర్‌ టీమ్‌తో మూడు మ్యాచుల్లో ఢకొీట్టనుంది. 26 మందితో కూడిన భారత జట్టుకు స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ సలీమ టెటె సారథ్యం వహించనుంది. ఫార్వర్డ్‌ క్రీడాకారిణి నవనీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.
భారత మహిళల హాకీ జట్టు : సలీమ (కెప్టెన్‌), నవనీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), జ్యోతి సింగ్‌, ఇషికా చౌదరి, సుశీల చాను, సుజాత, సుమన్‌ దేవి, జ్యోతి, కుజుర్‌, సాక్షి (డిఫెండర్లు), వైష్ణవి, నేహ, షర్మిలా, మనీశ, సునెలిట, మహిమ, పూజ, లాల్‌రెమిసియామి (మిడ్‌ఫీల్డర్లు), దీపిక, రుతుజ, ముంతాజ్‌, బల్జీత్‌, దీపిక, బ్యూటీ (ఫార్వర్డ్స్‌), సవిత, బిచు దేవి (గోల్‌కీపర్లు).

Spread the love