Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలి

- Advertisement -

అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథును అరెస్టు చేయాలి
మద్నూర్, డోంగ్లి , మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలు తహశీల్దారులకు వినతి పత్రాలు
నవతెలంగాణ-మద్నూర్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను వెంటనే బర్తరపు చేయాలని, ఆయన కుమారుడైన బండి భగీరథ్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని మద్నూర్, డోంగ్లి, మండల కేంద్రాల్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అనంతరం తహశీల్దార్లకు వారు వినతి పత్రాలు అందజేశారు. ఆందోళన కార్యక్రమాల్లో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనిస్, పటేల్ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -