ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనలో ఒకరు మృతి.. స్పందించిన కేంద్ర మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని నగరం చిగురుటాకులా వనికిపోతోంది. ఢిల్లీలో కురిసిన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలకు తెల్లవారు జామున 5.30 గంటల ప్రాతంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలింది. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఈ ప్రమాదంలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు బటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలానే ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Spread the love