కేంద్రానికి అపరిమిత అధికారాలు

 Unlimited powers to the Centre– ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’పై పినరయి
– రాజ్యసభ ప్రాముఖ్యత ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్య
– ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రతిఘటించాలని పిలుపు
తిరువనంతపురం : ఒకే దేశం…ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయా లన్న బీజేపీ ప్రభుత్వ ఆలో చనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యతిరే కించారు. ఈ యోచన కేంద్రానికి అడ్డూ అదుపూ లేని అపరిమిత అధికారా లు కట్టబెడుతుందని విమ ర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు వచ్చి గళం విప్పాలని ఆయన కోరారు. బీజేపీ ప్రభుత్వ ఆలోచన భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమి స్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ దీనిని గట్టిగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాలన్న సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నాలు దాని నీచమైన అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. తన అధికారాన్ని పటిష్టం చేసుకునేం దుకు సంఫ్‌ు పరివార్‌ మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను ధ్వంసం చేయా లని చూస్తోంది. ఈ విషపూరిత ప్రయత్నాలను వ్యతిరేకించేం దుకు మనమంతా సంఘటితం కావాలి. భారత రిపబ్లిక్‌కు పునాదిగా ఉన్న సూత్రాలను పరిరక్షించుకోవాలి’ అని పినరయి ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలకు తలవంచేందుకు నిరాకరించే రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచి, ఆయా రాష్ట్రాలలో దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించు కునేందుకు అజెండాను సిద్ధం చేశారని విమర్శించారు. సంఫ్‌ు పరివార్‌ చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు రాజ్యసభ ప్రాము ఖ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాలలో జరుగుతాయని, దీనివల్ల పార్లమెంట్‌ ఎగువ సభలో వివిధ పార్టీల బలా బలా లలో తేడా వస్తుందని తెలిపారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యసభ రాజకీయ వైవిధ్యం కనుమరుగవు తుందని వివరించారు. ఈ సంవత్స రం చివరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో ఓటమి తప్పదన్న భయం తోనే బీజేపీ హడావిడిగా జమిలి ఎన్నికలను తెర పైకి తెచ్చిం దని పినరయి వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటమి పొందితే రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందే మోనని బీజేపీ ఆందోళన చెందుతోందని చెప్పారు. సంఫ్‌ు పరివార్‌ కోరుకుంటున్నట్లు దేశ ఎన్నికల వ్యవస్థను నాశనం చేయడానికి రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య క్రమం అంగీకరించబోవని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వైవిధ్యాన్ని నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రతిఘటిం చాలని పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు.

Spread the love