Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజ సేవలో ఉప్పలయ్య కృషి మరువలేనిది 

సమాజ సేవలో ఉప్పలయ్య కృషి మరువలేనిది 

- Advertisement -

– జె ఎమ్ ఎమ్ జాతీయ కార్యదర్శి అసోద భాస్కర్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

దివంగత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ నాయకులు గుండెపాక ఉప్పలయ్య సేవలు మరువలేనివని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ అన్నారు. గురువారం ఆయన ప్రధమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించారు. పలువురు ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడుగా జాతి ఉన్నతి కోసం శ్రమిస్తూనే మరోవైపు సమాజంలో అనేక వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పని చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

ఉద్యమంలో అనేకమందికి అండగా ఉంటూ వారి జీవితాలను చక్కదిద్దారని అన్నారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా వారి పక్షాన అనేక ఉద్యమాలు చేసి వారికి అండగా ఉన్నారని ప్రతి ఒక్కరికి తలలో నాలుకల ఉంటూ నిస్వార్ధంగా సేవ చేసిన వ్యక్తి భౌతికంగా ప్రజల్లో లేకపోవడం ఆ లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాదరి ప్రశాంత్, యాసం సంధ్య రమేష్ , కత్తుల కళ్యాణి యాకాంతం, ఉప సర్పంచ్ గుండెపాక సోమనర్సయ్య, మాజీ సర్పంచ్ లు కస్తూరి శ్రీనివాస్, శ్రీరామ్, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు దాసరి ప్రకాష్, యాకయ్య జర్నలిస్టులు గొల్లపల్లి విజయ్ బాబు గౌడ్, జెల్ల ఉపేందర్, వెన్నం క్రాంతి రెడ్డి,మంద రవి, పులి నరసయ్య, జెల్లక వీరయ్య, బాణాల సంజీవ, రత్నపురం యాకయ్య,గార అనిల్ ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్ శ్రీనివాస్, హెచ్ రవి, హెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -