నవతెలంగాణ-మిడ్జిల్
గిరిజన తండాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మమ్మద్ గౌస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ అన్నారు. గురువారం మండలంలోని పెద్ద గుండ్ల తాండ గ్రామపంచాయతీలోని మర్ల బావి తండాలో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ రాజు నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తంగెళ్ల అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, సాయిలు, మాజీ ఎంపిటిసి సంపత్ కుమార్ ఉస్మాన్, గోదా కృష్ణ, ఉపసర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ సైలజ, మాజీ వార్డు సభ్యుడు శంకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



