- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొపెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలం కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజయదేవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



