ఊరూరా ప్రచారం – సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చిరంజీవి

నవతెలంగాణ – అశ్వారావుపేట: ఊరూరా పార్టీ గుర్తు, పార్టీ ఆశయాలను ప్రభావితం చేసే విధంగా ప్రచారం నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చిరంజీవి తెలిపారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ నుండి రెండు ఎన్నికల ప్రచార వాహనాలను ఆయన పార్టీ పతాకం ఊపి ప్రారంభించారు. విస్త్రుత ప్రచారం చేయడం ద్వారా ప్రతీ ఊరిలో పార్టీ గుర్తు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల, మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్, మడిపల్లి వెంకటేశ్వరరావు, కుంజా మురళీ, శ్రీ వేణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love