నిరుపయోగంగా మినీ స్టేడియం

– తలుపులు, కిటికీలు మాయం
– మందుబాబులకు అడ్డగా మారిన స్టేడియం
– క్రీడాకారుల విశ్రాంతి గదులలో పగిలిన బీరు సీసాలు
– గేట్ల ముందు ముల్లకంచె
నవతెలంగాణ-కందుకూరు
యువతీ యువకులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జనవరి 10వ తేదీ న 2008 సంవత్సరంలో రాష్ట్ర గనుల భూగర్భశాఖ మం త్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి హెచ్‌ఎండీఏ రూ.46 లక్ష లు నిధులతో మినీ స్టేడియం శంకుస్థాపన చేశారు. 2 ఏం డ్లలో మినీ స్టేడియాన్ని నిర్మించారు. మార్చి 10వ తేదిన 2010 సంవత్సరంలో రాష్ట్ర హౌంశాఖ మంత్రి స్థానంలో సబితా ఇంద్రారెడ్డి మినీ స్టేడియం ప్రారంభోత్సవం చేశారు. కందుకూరు మండలానికి కూతవేటు దూరంలో కొత్తగూడ గ్రామపంచాయతీ ప్రభుత్వ భూమిలో ఈ మినీ స్టేడియం నిర్మాణం చేశారు. సుమారుగా 14 ఏండ్లు కావ స్తున్నా అప్పుడప్పుడు క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు నిర్వ హిస్తున్నారు. ఆ క్రీడలు కూడా 5,6 నెలలకు ఒకసారి నిర్వ హిస్తున్నారు. అయితే క్రీడాకారుల కోసం విశ్రాంతి చిన్న భవనం నిర్మించారు. ఆ భవనం తలుపులు, కిటికీలు ఎప్పు డో మాయమయ్యాయి. తలుపు, కిటికీలు లేవు. ప్రహరీకి రెండు సైడ్‌లో నిర్మాణం చేశారు. ఒకపక్క నిర్మాణం చేయలేదు. కొత్తూరు గ్రామ పంచాయతీ వైపు ఉన్న వాగు సైడు ప్రహరీ నిర్మాణం చేయకపోవడంతో గ్రామపంచా యతీలు ట్రాక్టర్లలో తెచ్చి చెత్తాచెదారం ఇక్కడ వేస్తున్నారు. క్రికెట్‌ ఆడితే వాలీబాల్‌ ఆడితే క్రికెట్‌ బాలు, వాలీబాల్‌ వాగులో పడుతున్నాయి. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలని క్రీడాకా రులు అంటున్నారు.
క్రీడాకారులు విశ్రాంతి తీసుకునే రూములలో పగిలిన బీరు సీసాలు
క్రీడాకారులు క్రీడల సమయంలో విశ్రాంతి తీసుకోవ డానికి నిర్మించిన మినీ భవనం ఆకతాయిల అడ్డాగా మా రింది. మరుగుదొడ్లు, మూత్రశాల గదులలో చెత్తాచెదారం నిండి ఉంది. గేట్లు ఊడి పోయినాయి. బాగుచేసే నాథుడే లేడా అని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మినీ స్టేడియానికి దారే.. లేదు
క్రీడాకారులు, క్రీడల సమయంలో యువకులు తమ వాహనాలపై వెళ్లాలంటే రోడ్డు కూడా సరిగా లేదు. మినీ స్టేడియం పక్కనే ఇటుక బట్టీల నిర్మాణం కొనసాగుతుం డడంతో మామూలు మట్టి రోడ్డు మీద ఆధారపడి పోవలసి ఉంటుంది. రోడ్డు గుండా వెళ్లాలంటే బైకులు అదుపుతప్పి కింద పడే ప్రమాదం ఉంది. రోడ్డు బాగా చేయాలి. తలుపులు కిటికీలు బిగించి, మినీ భవనాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రభుత్వం తగు చర్యలు క్రీడాకారులు ప్రజలు కోరుతున్నారు.

గేట్ల ముందు ముళ్ళ కంచె తొలగించాం
సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ నుండి ఉపాధి హామీ పథకం ద్వారా మినీ స్టేడియం గేటు ముందు ముళ్ళ కంచె తొలగించాం. గేటు ముందల రాళ్లు రప్పలు జేసీబీతో తొల గించాం. పరిశుభ్రంగా ఉం చడానికి ప్రయత్నం చేశాను. మండల కేంద్రానికి కూతవేటు దూరములో ఉన్న మినీస్టేడియాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. క్రీడల అనంతరం క్రీడాకారులు విష యాన్ని తీసుకునే మినీ భవనాన్ని పరిశుభ్రంగా ఉంచి అందుబాటులోనికి తీసుకురావాలని కోరారు. క్రీడా శాఖ వారు పట్టించుకోవాలని కోరారు.
– సాదామల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌
స్టేడియం వద్ద వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలి
క్రీడాశాఖ వారు పట్టించుకోవాలి. నిధు లు విడుదల చేసి ప్రహ రీ నిర్మించాలి. గేట్లు చెడి పోయాయి. గేట్ల ముం దు ముల్ల కంచె ఉంది. స్టేడియం ముందు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలి. మండలానికి అతి దగ్గరలో ఉన్న మినీ స్టేడియం మండలంలో ఉన్న టువంటి అన్ని గ్రామాల క్రీడాకారులకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది. ఒకపక్క గోడ లేనందున క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్న సమయంలో క్రికెట్‌, వాలీబాల్‌ మినీ స్టేడియానికి అనుకోని ఉన్న వాగులో బాల్స్‌ పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రహరీ నిర్మించాలని కోరారు. క్రీడలు అప్పుడప్పుడు నిర్వహిస్తున్నామని విశ్రాంతి తీసుకునే గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆకతాయిలకు అడ్డగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
తాళ్ల కార్తీక్‌, క్రికెట్‌ క్రీడాకారుడు

ప్రధాన రహదారి నుంచి మినీ స్టేడియం వరకు రోడ్డు ఏర్పాటు చేయాలి
శ్రీశైలం, హైదరా బాద్‌ జాతీయ ప్రధాన రహదారి నుండి మినీ స్టేడియం వరకు రోడ్డు ఏర్పాటు చేయండి. ఈ మినీ స్టేడి యంలో క్రీడాకారులకు క్రీడలు నిర్వహించా లంటే రోడ్డు బాగా చేయాలని కోరారు. శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ ప్రధాన రహదారి నుండి మినీ స్టేడియం వరకు సుమారుగా 700 మీటర్ల వరకు దూరం ఉంటుంది. మట్టి రోడ్డు, గుంతల ఈ రోడ్డు మీద వెళ్లాలంటే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగే అవకా శం ఉంది. మట్టి రోడ్డు తీసివేసి ప్రభుత్వం నుండి నిధు లు మంజూరు చేసి మినీస్టేడియం వరకు రోడ్డు నిర్మా ణం చేయాలని కోరారు. అదేవిధంగా ఇక్కడ శాశ్వతంగా ఒక వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు. క్రీడాకారులు క్రీడల సమయంలో క్రికెట్‌, వాలీబాల్‌ వాగులో పడకుండా ప్రహరి గోడ నిర్మించాలని కోరారు.
– అజిష్‌, క్రికెట్‌, వాలీబాల్‌ క్రీడాకారుడు
క్రీడా శాఖ వారి దృష్టికి తీసుకెళ్తాం
క్రీడాకారుల శాఖ అధికారుల దృష్టికి తీసు కువెళ్తామన్నారు. మినీ స్టేడియాన్ని పరిశీలించి, సమస్యలు తెలుసుకుని క్రీడాశాఖ వారికి సమా చారం అందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అన్ని రకాల క్రీడాకారుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడా కారులు క్రీడల్లో రాణించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
– సరిత, కందుకూరు ఎంపీడీవో

Spread the love