ఆదాయం పెంచుకునే ప్రయత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీ అదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. సరికొత్త ప్రయోగాలతో ముందుకు పోతున్నది. ఇప్పుడు వ్యాపార రంగంలోనూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులను చేరవేయడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్విని యోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయిం చేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఉపయో గంగా ఉండనుంది. సాధారణంగా ఏ వ్యాపా రానికైనా వినియగదారులు అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్‌లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారంతో ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు వినియోగదార్లు అందుబాటులోకి వస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌ల నుంచి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారను న్నాయి.సంస్థను లాభాల బాట పట్టించ డంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పారదర్శకమైన నిబంధ నలు, లీజు పద్ధతుల ద్వారా ఈ స్థలాలను కేటాయించనున్నారు. తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtc.telangana.gov.in లో పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. టీజీఎస్‌ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి ఊతమివ్వనుందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ పారదర్శకతకు పెద్దపీట వేసేలా సంస్థ పరిధిలోని అన్ని వ్యాపార సముదాయాల వివరాలను యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అవి ఖాళీగా ఉన్నాయా లేక నిండిపోయాయా, ప్రస్తుతం ఆ షాప్ లను ఎవరు నిర్వహిస్తున్నారు, వాటి లీజు కాలపరిమితి, అద్దె ఎంత అనే పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లభిస్తున్నది. దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడుతూ, వ్యాపార ప్రకటనలు, అద్దెదా రుల ఎంపికలో డిజిటల్ జవాబు దారీత నాన్ని పెంచేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది.
ఆర్టీసీతో చేతులు కలపండి,
మీ వ్యాపారాన్ని పెంచుకోండి
ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశామనీ, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం వ్యాపారులకు ఎంతో లాభదాయకమనీ, దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎండీ వై.నాగిరెడ్డి కోరారు
-ఎండీ వై.నాగిరెడ్డి
అద్దెకు ఖాళీ ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



