Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబోనాల పండుగలోప్యాడ్ బ్యాండ్ కు అనుమతివ్వాలి

బోనాల పండుగలోప్యాడ్ బ్యాండ్ కు అనుమతివ్వాలి

- Advertisement -

సౌండ్ కంట్రోల్ కమిషన్ వేసి వాల్ట్ నిర్ణయించాలి
జీవో నెంబర్ 227 ద్వారా బ్యాండ్ కళాకారుల ఉపాధి దెబ్బతీయొద్దు : డీజీపీకి తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బోనాల పండుగలో ప్యాడ్ బ్యాండ్ కు అనుమతివ్వాలని తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు నేతృత్వంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజ్ నాగరాజు, నగర కార్యదర్శి వేముల శ్రీనివాస్, నగర అధ్యక్షులు అశ్వాల హనుమంత్, నగర సలహాదారులు రాజు డీజీపీ సీ.వీ.ఆనంద్ కు వినతిపత్రం సమర్పించారు. సౌండ్ కంట్రోల్ కమిషన్ వేసి వాల్ట్ నిర్ణయించాలనీ, రాత్రి 11 సమయం తర్వాత బ్యాండ్ ఆపేలా ప్రజలను చైతన్య పరచాలనీ, జీవో నెంబర్ 227 ద్వారా బ్యాండ్ కళాకారుల ఉపాధి దెబ్బతీయొద్దనీ, పోలీసుల వేధింపులు బ్యాండ్ కళాకారులపై ఆపాలని వారు కోరారు. “హైదరాబాద్ లో బోనాల ఊరేగింపులలో డప్పు బ్యాండ్ వాయిద్యాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి పండుగలో బోనాల పండుగ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు గ్రామాలు , పట్టణాలు ఆషాడ మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. బోనాల పండుగ కలర వ్యాధితో జనం పిట్టల రాలిపోతున్న కాలంలో కలర మాహమ్మారి నుండి రక్షణ పొందేందుకు ప్రజల ఆరోగ్యం బాగుపడితే జబ్బులు తగ్గితే నైవేద్యం సమర్పించుకుంటామని ప్రజల మొక్కు ద్వారా ప్రారంభమైంది.

నాటి హైదరాబాద్ ప్రజలకు అలా ఏర్పడిన విశ్వాసంతో అతివృష్టి, అనావృష్టి ఏ సమస్య ఎదురైనా బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని వేడుకునేవారు. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో హైదరాబాద్ లోని దేవాలయాలకు, మసీదులకు సహాయం అందించే వారనీ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ రోజులు జరుపుకునే ఈ పండుగకు శాంతియుతంగా స్థానికులు ప్రజలు అన్ని వర్గాల వారు ఐక్యంగా చేసుకునేందుకు సాంస్కృతికంగా అన్ని వర్గాల వారినీ కలుపుకొని నిర్వహించేందుకు అనుమ తులు ఇచ్చేవారు..”అని వారు గుర్తుచేశారు.“మహిళలు నెత్తిన నైవేద్యంతో కూడిన బోనం కుండతో ఇంటి నుండి బయలుదేరి గుడికి వెళ్లే వరకు జానపద కళలు డబ్బు కళాకారులు బ్యాండ్ కళాకారులు పోతరాజు వేషధారణలో నృత్యాలతో సామూహిక ఐక్యత ఏర్పడేది. బోనాల పండుగలో కళాకారులు ముఖ్య పాత్ర పోషిస్తారు. వారి ప్రదర్శనలు, ఆటపాటలు, సంగీతంతో ప్రజలు ఐక్యతను పెంచుతూ ఆనందాన్ని పంచుతారు. ఈ పండుగ ద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రదర్శనలకు అనుమతినిచ్చింది..” అని తెలిపారు.

ఇటీవల కాలంలో సౌండ్ పొల్యూషన్ పేరుతో బ్యాండ్ వృత్తిలో వచ్చిన టెక్నాలజీ ఫ్యాట్ బ్యాండ్ కీబోర్డ్ తో నడిచే వెహికల్స్ ను డీజే తో సమాంతరంగా 227 జీవో లోకి తెచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెహికల్ కు అనుమతి లేదంటూ అనేక పోలీస్ స్టేషన్న్ల పరిధిలో సీజ్ చేస్తున్నారని చెప్పారు. బ్యాండు మాస్టర్లపై కేసులు నమోదు చేస్తుండటంతో వారికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని వాపోయారు. జీవో 227 రద్దు చేసి సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ కమిషన్ వేసి సౌండ్ వాల్ట్ మార్పు ద్వారా మానవతా దృక్పథంతో లక్షలాది మంది బ్యాండ్ కళాకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని వారు కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ వినతి పట్ల డీజీపీ సానుకూలంగా స్పందించారనీ, బ్యాండ్ కళాకారుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -