Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగవర్నర్‌తో మంత్రి అడ్లూరి భేటీ

గవర్నర్‌తో మంత్రి అడ్లూరి భేటీ

- Advertisement -

వృద్ధుల సంక్షేమం, వికలాంగుల సాధికారతపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్‌‌తో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం, రాష్ట్రంలో చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై గవర్నర్‌కు వివరించారు. ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి గవర్నర్‌ ఆహ్వానించారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల సాధికారత శాఖ సంచాలకులు బి. శైలజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -