అనవసర ఖర్చులు తగ్గించి
రూ.50 లక్షల సహాయం
అనాథ, ప్రతిభావంతులైన వారికి మద్దతుగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం
అబ్దుల్ ముఖీత్ చందా సామాజిక బాధ్యతకు నిదర్శనం : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల చదువు కోసం పెండి ఖర్చులను మళ్లించిన బీఆర్‌ఎస్ నాయకుడు అబ్దుల్ ముఖీత్ చందాను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. వివాహ వేడుకల్లో విపరీతమైన అలంకరణలు, అనవసర ఖర్చులకు స్వస్తి పలికి విద్యార్థుల భవిష్యత్తు కోసం రూ.50 లక్షల సహాయం విరాళంగా అందించారు. అనాథ, ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతుగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం హైదరాబాద్ లో అబ్దుల్ ముఖీత్ చందా…కేటీఆర్‌ను కలిశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం డబ్బును వెచ్చించాలని అబ్దుల్ ముఖీత్ చందా, ఆయన కుటుంబం నిర్ణయించుకోవడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. సర్ సయ్యద్ సొసైటీ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారని వివరించారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల ఒక విద్యా సంవత్సరపు ట్యూషన్ ఫీజును చెల్లించడం ద్వారా, వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ప్రకటించారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా, సర్ సయ్యద్ సొసైటీ విజ్ఞప్తి మేరకు పలు విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీని ప్రకటించాయని చెప్పారు. ఈ ఉమ్మడి కృషి వల్ల మరిన్ని ఎక్కువ మంది విద్యార్థులకు మేలు చేకూరనుందని వివరించారు. ఈ కార్యక్రమం అబ్దుల్ ముఖీత్ చందా సామాజిక బాధ్యతకు నిదర్శనమని అన్నారు. ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు.
విద్యార్థుల చదువుల కోసం పెండ్లి ఖర్చులు మళ్లింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



