Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ అపాయింటెడ్ డే ప్రకటించాలి

ఆర్టీసీ అపాయింటెడ్ డే ప్రకటించాలి

- Advertisement -

తెలంగాణ జాతీయ యూనియన్ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్
నిరవధిక నిరాహార దీక్ష‍కు బైటాయింపు.. భగ్నం చేసిన పోలీసులు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలనీ, అపాయింటెడ్‌ ‌తేదీని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆ సంఘం వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష‍ను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లోని బస్ భవన్‌‌ ఎదుట ఆయన భైటాయించారు. పలువురు ఆర్టీసీ కార్మికులు, కార్మికులు హాజరయ్యారు. తొలుత దీక్ష‍ను బస్ భవన్‌‌లో ప్రారంభించగా అనంతరం ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ ‌చేశారు . దీక్షకు మద్దతుగా ఒకరోజు దీక్షలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వాములయ్య, హైదరాబాద్ రీజినల్ సెక్రెటరీ బుల్లెట్ పాండు, నల్లగొండ రీజినల్ కార్యదర్శి మురళి, కృష్ణ, శంషాద్దీన్, పరిగి అంజయ్య, బోధన్ జికే ప్రసాద్, తాండూర్ శీను, నర్సంపేట్ డిపో వేణు,రిలే నిరాహార దీక్ష బస్ భవన్ వద్ద కొనసాగుతుండగా అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అక్కడా దీక్షను కొనసాగించారు. మద్దతు తెలియజేస్తూ పోలీస్ స్టేషన్‌కు జేఏసీ చైర్మెన్‌ వెంకన్న, వైస్ చైర్మెన్‌ థామస్ రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్ సుద్దాల సురేష్, ఎస్‌‌టీఎంయూ ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్,తెలంగాణ ఉద్యమాల ఆకాంక్ష వేదిక అధ్యక్షుడు జీకే స్వామి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంపత్ వెళ్లారు. రేపు అన్ని డిపోలలో మీ అనుకూల సమయాలలో ధర్నాలు నిర్వహించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం శ్రేణులకు పిలుపునిచ్చింంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి రవీందర్ రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి ప్రేమ్ నాథ్, రాష్ట్ర కోశాధికారి పిఎస్ఎస్ రావు వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ వెంకట్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -