నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విద్యా స్రవంతి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దీపాదాస్ మాట్లాడుతూ విద్యా స్రవంతి లాంటి విద్యా వేత్తలు, మేధావులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. తమ పార్టీలోకి వచ్చే వారి సేవలను ఉపయోగించుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యేవారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.