ఎంపీటీసీకి గ్రామస్థుల ఆత్మీయ వీడ్కోలు

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల పదవి విరమణ పొందిన మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ తాజా మాజీ ఎంపిటిసి సభ్యురాలు-2 రావుల కల్పన మొగిలికి శనివారం గ్రామస్తులు పాత గ్రామపంచాయతీ ఆవరణలో వైభవంగా వీడ్కోలు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్నీ నిర్వహించారు.ఈ సందర్భంగా పూలమాల,శాలువాతో సత్కరించారు. ఐదేళ్లలో ఆమె గ్రామ ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నతా పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామిడి గట్టయ్య,అక్కపాక సమ్మయ్య,ఆర్ని సత్యనారాయణ,రామిడి మొగిలి,గంప సంపత్,బలజ భూషణం పాల్గొన్నారు.
Spread the love