నవతెలంగాణ-కొడంగల్
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించేకోవాలని సీఐ. రాములు తెలిపారు. శుక్రవారం కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశానికి సీఐ రాములు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ రాబోయే పరిణామాలను ముందస్తుగా ఆలోచించి నిర్వ హించే సమావేశమై శాంతి సమావేశామని తెలిపారు. కొడంగల్ ప్రజలపై పూర్తి ప్రగాఢ నమ్మకం ఉందని వచ్చే నిమజ్జనం వేడుకల్లో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీసులు సహకారం ఉటుందన్నారు. డీజేలు వాడడం వల్ల అనారోగ్య సమస్య వినికిడి సమస్య భారీన పడే ప్రమాదం ఉదని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాములు, శివరాం గౌడ్, నరేందర్ రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.