శ్రీ గాయత్రి పాఠశాలలో వివేకానంద జయంతి వేడుకలు

– పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేసిన ఎస్సై భరత్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఉషారాణి
– వివేకానంద జీవిత చరిత్రను వివరించిన జాతీయ విద్యా రత్న అవార్డు గ్రహీత జాగిరి జగదీష్‌
నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ పట్టణంలోని శ్రీ గాయత్రీ పాఠశాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్స వాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసాలు, దేశభక్తి గీతాలు వంటి అంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఉషారాణి, ఎస్సై భరత్‌ రెడ్డిలు పాఠశాల కరస్పాండెంట్‌ రాముతో కలిసి అందజేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో కోడంగల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఉ షారాణి, స్థానిక ఎస్సై భరత్‌ రెడ్డిలు జ్యోతి ప్రజ్వ లన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రౖన ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌, జాతీయ విద్యా రత్న అవార్డు గ్రహీత జాగిరి జగదీష్‌ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్ర వివరించారు. దేశప్రాముఖ్యతను ప్రపంచ నలుమూలలకు చాటిచెప్పిన మేధావి వివేకానంద యని కొనియా డారు. దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని, దేశ ఔన్న త్యాన్ని కాపాడడంలో యువత ముందుం డాలని యువతను ప్రేరేపించిన మహౌన్నతుడని స్వామి వివేకానందను గుర్తుచేశారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో విద్యనభ్యసించాలని, చదువు పట్ల ఏకాగ్రత, ఉండాలన్నారు. పరిపూర్ణ ఏకాగ్రత, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, తాము ఎంచుకున్న లక్ష్యం సాధించేవరకు ఎకడా వెనక్కి తగ్గరాదని సూచించారు. విద్యార్థులు ఉన్నతమైన స్థానాన్ని చేరుకొని పాఠశాలకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కీర్తిప్రతి ష్టలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో విద్యా ర్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Spread the love