
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో దుబ్బాక ఎఏంసి చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ, ఎంపీటీసీ సభ్యురాలు పొలబోయిన లక్ష్మి నారాగౌడ్ ప్రభాకరన్నను గెలిపించాలని కోరుతూ ఇంటింటా తిరుగు ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఓ ఇంట్లో బీడీలు చూడుతున్న తారస పడ్డ మహిళతో వారు ముచ్చటించారు.గతపాలకులు ప్రజల కష్టాలు తెలుసుకోలేదు. కాంగ్రెస్ పాలనలో కేవలం రూ. 200 పెన్షన్ ఇస్తే మన కష్టం తెలిసిన మనిషిగా సీఎం కేసీఆర్ అధికారంలోకి నేడు రూ. 2016కు పెంచి ప్రతి నెల బ్యాంకుల్లో జమ చేస్తున్నారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో కేసిఆర్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ లబ్ది పొందుతారన్నారు అంతక ముందు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.