హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధులపై ప్రజల కు అవగాహన కల్పిస్తున్నాం…

– ప్రాజెక్టు డైరెక్టర్ కే హైమావతి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కోఠి లోని రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్  డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ కే హైమావతి, టీఎస్ ఎమ్ ఎస్ ఐ డి సి ఎస్ మేనేజింగ్ డైరెక్టర్  చంద్రశేకర్ రెడ్డి, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్  మురళీధర్ కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగాప్రాజెక్ట్ సంచాలకులు  హైమావతి  మాట్లాడుతూ. 1988 నుండి ప్రతి డిసెంబర్ 1 వ. తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నామన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడానికి, హెచ్ఐవి నివారణ, చికిత్సా, సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి  ఎయిడ్స్ బారినపడి మరణించినవారి జ్ఞాపకార్థం ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.తెలంగాణలో దాదాపు 1,58,974 మంది హెచ్ఐవి, ఎయిడ్స్ తో జీవిస్తున్నట్లు అంచనా వేయబడింది అన్నారు. వయోజన జనాభాలో 0.45% ప్రవ్యాప్తి రేటుతో భారతదేశ సగటు కన్నా రెట్టింపు ఉండటం కొంచెం ఆందోళన కలిగించే విషయంగా పరిగణించాలని అన్నారు వీరిలో పురుషులు 84,849 మంది, మహిళలు 74,125 మంది ఉన్నారు. 2021లో, దాదాపు 1947 మందికి కొత్తగా  హెచ్ఐవి సోకగా దాదాపు 2369 మంది వ్యక్తులు  ఎయిడ్స్-సంబంధిత కారణాల వల్ల మరణించారని వివరించారు.హెచ్ఐవి,ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించడానికి, అల్ ఇండియా రేడియో, మరియు ప్రైవేట్ ఎఫ్. ఎం. చాన్నాళ్ళ ద్వారా, జింగిల్స్ ను, ప్రైవేట్ టీవీచాన్నాళ్ళలో వీడియో స్పాట్స్, ఆటో రిక్షాలపై ప్రచారసమాచారం ప్రదర్శించడం, బస్ స్టాంచులు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో హోర్డింగులు ఏర్పాటు చేయడం, రైల్వే స్టేషన్లలో పాల్ బోర్డ్స్ ఏర్పాటుచేయడం, బస్ షెల్టర్ల పై బ్రాండింగ్ చేయడం. 30 లక్షల నుండికి సంక్షిప్త సమాచారాన్ని  వాట్సప్ మెసేజీలు చేరవేయడం. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో మరియు మాల్స్ నందు ఫ్లాష్ మాబ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. టి. జ. యస్. జి.ఓ. ల ద్వారా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్లలో మరియు జూ పార్క్ ఆవరణలో జి.ఇ. సి. స్టాల్స్ ఏర్పాటుచేసి, ప్రజలలో విస్తృతంగా హెచ్ఐవి వ్యాపించే మార్గాలు, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించబడుతున్నదని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ చంద్ర శేకర్ రెడ్డి  మాట్లాడుతూ.. హెచ్ఐవి సోకిన వ్యక్తుల పట్ల చిన్నచూపు, వివక్ష చూపకుండా వారితో సహానుభూతితో మెలగాలని కోరారు.అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. యన్. మురళీధర్  మాట్లాడుతూ.. కమ్యూనిటీలు సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ ని అంతం చేయడంలో వారి నాయకత్వ పాత్రలకు పూర్తి మద్దతుకు సహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిచే హెచ్ఐవి నివారణ, నియంత్రణ కొరకు పాటుపడి హెచ్ఐవి ‘రహిత తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషిచేయాలని ప్రతిజ్ఞ చేయించారు.తెలంగాణా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్ణ ఆవరణలో క్యాండిల్ లైట్ విజిల్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మరణించినవారి ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, సిబ్బంది, భాగస్వాములు ప్రభుత్వేతర సంస్థలు కమ్యూనిటీ ఆధారిత సంస్థలు పాల్గొన్నారు.
Spread the love