సీఏఏను వ్యతిరేకిస్తున్నాం

We are opposing CAA– ఓ వర్గం నిర్వీర్యమే దీని లక్ష్యం
– ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నాం : కేరళ సీఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం : మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్ప పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదనీ, ఈ వైఖరికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నదని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. దేశాభిమాని సాహిత్య అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని నిర్వీర్యం చేయటమే సీఏఏ లక్ష్యమన్నారు. ”సీఏఏను త్వరలో అమలు చేస్తారన్న వార్తను మేము వింటున్నాం. దీని (సీఏఏ) అమలు కేరళలో జరగదని మేము అప్పట్లోనే చెప్పాం. ఇప్పటికీ ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ వైఖరి ఇదే” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లౌకిక దేశాన్ని మతతత్వ దేశంగా మార్చే ప్రయత్నాలు బలంగానే జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని గతేడాది డిసెంబర్‌లో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Spread the love