Friday, May 1, 2026
E-PAPER
Homeజిల్లాలుకార్మికుల హక్కుల కొరకు పోరాడాలి

కార్మికుల హక్కుల కొరకు పోరాడాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కొరకు పోరాడాలని కార్మికులోకానికి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా నాయకులు సారా సురేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రం తోపాటు ఉప్లూర్, హాస కొత్తూర్ గ్రామాలలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ ఆఫీస్ వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సారా సురేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల రోజు ఇది అన్నారు.

బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోల్డ్ గా విభజించి కార్మికులకు పని లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా పెట్టుబడుదారులకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ దేశ సంపద మొత్తం ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి నాలుగు లేబర్ కోడ్స్ కు కుదించి యజమాన్యాన్ని కార్మికులకు ప్రశ్నించకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో వి.ఆనంద్, ఎస్,లక్ష్మి పెద్ది రాజేశ్వర్, వి.అశోక్, టి.బాలయ్య, ఖదీర్, గంగారాం, పెద్ది కిషన్ గౌడ్, గౌరీ లక్ష్మి, హాస కొత్తూరు సర్పంచ్ గంగాధర్, కమ్మర్ పల్లి ఉపసర్పంచ్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -