Friday, May 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా మే డే…..

ఘనంగా మే డే…..

- Advertisement -


నవతెలంగాణ-బజార్ హాత్నూర్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మే డే వేడుకలను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు, రోజువారి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్ర జెండా ఆవిష్కరణ చేసి, కార్మికుల హక్కులు, సంక్షేమం, సమాన వేతనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువూరు నాయకులు మాట్లాడుతూ కార్మికులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని, వారి కష్టానికి తగిన గుర్తింపు, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బాధ్యులు సురేష్, సిఐటియు మండల నాయకులు దేవేందర్, గ్రామపంచాయతీ కార్మికులు రవి, ఉషన్న, నర్సక్క, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్మికులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -