- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



