Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి

పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి

- Advertisement -

కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి రాకేష్ రావు
నవతెలంగాణ – పరకాల 

దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్స్ పోలియో’ నిర్మూలనా కార్యక్రమం స్థానికంగా విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 14వ వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి రాకేష్ రావు స్వయంగా పోలియో కేంద్రానికి హాజరై, చిన్నారులకు పోలియో చుక్కలను వేయించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్యపైనే ఆధారపడి ఉందని, వారిని వ్యాధుల బారి నుంచి కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సెలవు దినమైనప్పటికీ, ఎంతో నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, అంగన్‌వాడీ కార్యకర్తలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాడి భగవాన్ రెడ్డి, బండి వెంకటేష్, వైద్య సిబ్బంది డా. తూమ్ వంశీరెడ్డి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -