సర్పంచ్ పచ్చిక దిలీప్ రెడ్డి..
నవతెలంగాణ – టేకుమట్ల
జాతీయ పోలియో దినం జూన్ 28 సందర్భంగా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ పచ్చిక దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారులకు పోలియోచుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరి అని తెలిపారు. చిన్నారులకు ఆరోగ్య రక్షణకు పోలియో చుక్కలు ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లబెల్లి మొండి,ఆశ వర్కర్ సోతుకు స్వప్న,అంగన్వాడి సిబ్బంది సోమిడి స్వరూప,మాను పాటి అనూష,తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



