హామీ ఇస్తున్నా మిగిలిన పనులు పూర్తి చేస్తాం..

జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్..

నవతెలంగాణ డిచ్ పల్లి: గత పదేళ్లుగా రూరల్ నియోజకవర్గం లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని, కులమత, వర్గం భేదం లేకుండా అందరి సంక్షేమానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎనలేని కృషి చేశారని, రాబోవు రోజుల్లో మరింత కృషి చేసి జిల్లాలోనే రూరల్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి పూనుకున్న మని, ప్రజలకు అయా వర్గాలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేసే భద్యత తమపై ఉందని దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు. శనివారం ఇందల్ వాయి మండలంలోని గన్నరం జాతీయ రహదారి పక్కన గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సబ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు సంఘాల అధ్వర్యంలో సమావేశలు పేట్టుకుని ఏకగ్రీవ తీర్మానం చేయడం అబినందనియ మన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక కృషి తో నీయోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో కోట్ల రూపాయల మేర అబివృద్ధి చేశారని, ఈసారి భారీ మెజార్టీ తో గేలిపించుకుంటే మంత్రి పదవి ఖాయమని, దీంతో రూరల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్దకు ఏ వర్గానికి చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే వారందరిని కాదనకుండా సమస్యల పరిష్కారానికి అప్పటి కప్పుడే కృషి చేశారని అలాంటి నాయకునికి రూరల్ ప్రజలు వదులుకోవద్దని సూచించారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని, ఇదే కాకుండా పలువురు వచ్చి నామినేషన్లకు సైతం డబ్బులు అందజేస్తున్నరని, ఇతరులు మాటలను నమ్మవద్దని, ఎన్నికలు ముగిసిన తర్వాత అలాంటి వారు కనబడరని, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల కోసం శ్రమించే నాయకుడిని, కరోన సమయంలో ఎందరికో ధైర్యం చెప్తూ వారందరికీ అందుబాటులో ఉన్నారని, ఇతరులు మాయ మాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నం చేస్తారని బాజిరెడ్డి జగన్ మోహన్ పేర్కొన్నారు. కొనియాడారు. గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారందరికీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మోహన్ నాయక్, రాజు నాయక్, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి దాస్, బీఆర్ఎస్ రూరల్ ఎస్సీ కన్వీనర్ పాశం కుమర్, సర్పంచ్లు తెలు విజయ్ కుమార్, చింతల దాస్, కాచ్చకాయల శ్రీనివాస్, సుధాకర్, సుదిర్, సీనియర్ నాయకులు అరటి రఘు, సిహెచ్ దాస్, బిరిష్ శేట్టి, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love